Vastu Tips: మగవాళ్లు ఏ రంగు పర్సులు వాడితే డబ్బు అధికంగా నిల్వ ఉంటుందో తెలుసుకోండి
Vastu Tips: మగవారు పర్సులోనే డబ్బులును అధికంగా పెట్టుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం పర్సుల కలర్ వల్ల కూడా అదృష్టం, వృద్ధి, డబ్బు, విజయం కలిసి వస్తాయి.
Vastu Tips: మగవారికి కచ్చితంగా పర్సులు ఉండాల్సిందే. వీరు అధికంగా పాకెట్ పర్సును వాడతారు. ఆడవారు కూడా హ్యాండ్ బాగ్లను అధికంగా వాడుతూ ఉంటారు. వీటిలోనే వారు డబ్బులను నిల్వ చేస్తూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్ర ప్రకారం పర్సుల రంగు వల్ల కూడా అదృష్టం, విజయం, డబ్బు అధికంగా కలిసి వస్తాయి. వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్న ప్రకారం ఎలాంటి రంగు పర్సులను వాడాలో, ఏ రంగు పర్సులను దూరం పెట్టాలో తెలుసుకోండి. ఎందుకంటే జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనది. ఇప్పుడు డబ్బే మనిషిని నడిపిస్తోంది. చేతిలో డబ్బులు లేకపోతే ఏ పనీ చేయలేని స్థితి. కాబట్టి వాస్తు శాస్త్రం ఏ రంగు పరీక్షలను వాడాలో వివరిస్తుంది. ఆ రంగు మీ ఆర్థిక పరిస్థితి పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకోండి.
నారింజ రంగు
నారింజ రంగు పర్సులు దొరుకుతూ ఉంటాయి. ఆడవాళ్లకు, మగవాళ్ళకు కూడా నారింజ రంగును ఉత్తమంగా పనిచేస్తుంది. అన్ని రంగుల్లో కన్నా శక్తివంతమైనది నారింజ రంగే. ఈ నారింజ రంగు పర్సు వాడడం వల్ల అంతా సానుకూలంగా ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది.
ఆకుపచ్చ
ఆకుపచ్చ రంగు పర్సులు లేదా హ్యాండ్ బ్యాగులు వాడటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గ్రీన్ కలర్ పర్సుల వల్ల సంపద, శ్రేయస్సు కలుగుతుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది. సమృద్ధిగా డబ్బు నిల్వ ఉంటుంది. అభివృద్ధిని ఆకర్షించే రంగు ఆకుపచ్చ కాబట్టి వీలైనంతవరకు ఆకుపచ్చ రంగు పరీక్షలు వాడడానికి ప్రయత్నించండి.
నీలం రంగు
నీలం రంగు పర్సులు కూడా ఎంతో మంచివి. నిజానికి నీలిరంగు ప్రశాంతతను సూచిస్తుంది. నీలం రంగు పర్సు వాడితే ఎలాంటి ఆర్థిక సంక్షోభాలు రాకుండా ఉంటాయి. అంతేకాదు పాజిటివిటీ పెరుగుతుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది.
గోధుమ రంగు
గోధుమ రంగు శక్తివంతమైనది. ఇది విజయాన్ని ఆకర్షిస్తుంది. ఈ రంగు వాడడం వల్ల ఖర్చులు కొంతమేరకు పెరగకుండా ఉంటాయి. ఖర్చులను తగ్గించే శక్తి అదుపులో ఉంచే గొప్పతనం ఈ రంగుకి ఉంది.
ఎరుపు రంగు
ఎరుపు రంగు పర్సులు వాడకపోతేనే మంచిది. ఎరుపు రంగు పరీక్షలు వాడడం మంచిది కాదు. ఇది ఖర్చును పెంచుతుంది. ఎరుపు రంగు పరీక్షలు వాడితే నీళ్ళలాగా డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఇది ఖర్చులను అదుపులో ఉంచలేదు. కాకపోతే ఇది అదృష్టాన్ని పెంచుతుందని అంటారు. అలాగే భద్రతను కూడా అందిస్తుందని నమ్ముతారు. కాబట్టి మీకు ఏ రంగు పర్సు నచ్చితే ఆ రంగు పర్సును వాడకుండా... మీకు మేలు చేసే రంగు పర్సును ఎంచుకోవడం మంచిది.
టాపిక్