Swapna Shastra: చెత్తను పారబోయడంతో పాటు ఈ 4 కలలు పదే పదే వస్తున్నాయా? అయితే మీరు త్వరలో గొప్ప విజయాన్ని పొందుతారు!-according to swapna shastra these 4 dreams will bring success and happiness in life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Swapna Shastra: చెత్తను పారబోయడంతో పాటు ఈ 4 కలలు పదే పదే వస్తున్నాయా? అయితే మీరు త్వరలో గొప్ప విజయాన్ని పొందుతారు!

Swapna Shastra: చెత్తను పారబోయడంతో పాటు ఈ 4 కలలు పదే పదే వస్తున్నాయా? అయితే మీరు త్వరలో గొప్ప విజయాన్ని పొందుతారు!

Peddinti Sravya HT Telugu

Swapna Shastra: కలలు ఆధారంగా చాలా విషయాలను మనం చెప్పవచ్చు. భవిష్యత్తులో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేది కూడా అర్థమవుతుంది. ఇటువంటి కలలు వచ్చినట్లయితే అవి విజయానికి సంకేతం. ఈ కలలు వస్తే విజయం మీదే. తప్పకుండా అనుకున్నవి తప్పకుండా జరుగుతాయి.

Swapna Shastra: చెత్తతో పాటు ఈ 4 కలలు పదే పదే వస్తున్నాయా?

మనం రోజూ ఎన్నో కలలు కంటూ ఉంటాము. కొన్ని కలలు గుర్తుంటాయి. కొన్ని కలలు మర్చిపోతూ ఉంటాము. అయినప్పటికీ స్వప్న శాస్త్రంలో కలలు వెనక అర్థాలు ఉన్నాయి. మనకు వచ్చిన కలని బట్టి దాని వెనుక అర్థం ఏంటో తెలుసుకోవచ్చు. స్వప్న శాస్త్రం ప్రకారం ఈ కలలు వచ్చినట్లయితే త్వరలోనే మీరు విజయాలని అందుకుంటున్నారని అర్థం.

కలలు జీవితానికి సంబంధించిన పెద్ద సూచనలను ఇస్తాయి. నిజజీవితంతో కూడా కలలు ముడిపడి ఉంటాయి. ఒక్కోసారి భయంకరమైన కలలు కూడా వస్తూ ఉంటాయి. అయితే, వచ్చిన కలలు ఆధారంగా చాలా విషయాలను మనం చెప్పవచ్చు. భవిష్యత్తులో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేది కూడా అర్థమవుతుంది. ఇటువంటి కలలు వచ్చినట్లయితే అవి విజయానికి సంకేతం. ఈ కలలు త్వరలోనే మీరు అనుకున్నవి, చెయ్యాలని సాధిస్తారని చెప్తాయి.

ఈ కలలు వస్తే విజయం మీదే

1.స్త్రీ నాణేలు పట్టుకున్నట్టు

స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో స్త్రీ నాణేలు పట్టుకుని కనపడినట్లయితే అది చాలా మంచి సంకేతం. త్వరలోనే మీరు సక్సెస్ ని అందుకుంటారని ఈ కల చెప్తుంది. ఇటువంటి కల వచ్చినట్లయితే లక్ష్మీదేవికి ఎర్రని పూలను సమర్పించండి. ఈ విధంగా చేయడం వలన ధన ప్రవాహం కలుగుతుంది.

2.పెద్దవాళ్ల పాదాలను నమస్కరించుకున్నట్లు

పెద్దవాళ్ళ పాదాలను నమస్కరించినట్లు కల వచ్చినట్లయితే, ఇది శుభ ఫలితాలను ఇస్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం ఇటువంటి కల వచ్చినట్లయితే ప్రమోషన్ త్వరగా వస్తుంది. ఉద్యోగంలో ఈ మార్పు రావడం వలన సంతోషంగా ఉండొచ్చు. ఇటువంటి కల వచ్చినట్లయితే అరటి చెట్టుకి నీళ్లు పోయండి. ఇలా చేయడం వలన మీ కల నెరవేరుతుంది. మంచి ఫలితం వస్తుంది.

3.పాదాల కింద చెత్త

ఎప్పుడైనా పాదాల కింద చెత్త ఉన్నట్లు కల వచ్చినట్లయితే, త్వరలో శుభవార్త వింటారని, విజయాన్ని అందుకుంటారని అర్ధం. ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయని దానికి సంకేతం. ఇటువంటి కల వచ్చినప్పుడు మీరు వేసుకున్న ప్రణాళిక గురించి ఇతరులతో చెప్పకండి.

4.చెత్తని చెత్తబుట్టలో వేస్తున్నట్లు

చెత్తని చెత్తబుట్టలో వేస్తున్నట్లు కల వచ్చినట్లయితే భవిష్యత్తులో మీ కష్టాలన్నీ తీరిపోతాయని దానికి అర్థం. ఇటువంటి కల వచ్చినట్లయితే భావోద్వేగాల భారం నుంచి మిమ్మల్ని మీరు విడిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. జీవితంలో ముందుకు సాగండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Peddinti Sravya

eMail

సంబంధిత కథనం