Puja Room Vastu: పూజగదిలో పొరపాటున కూడా ఈ 4 ఉంచకండి.. ఎంతో నష్టం కలుగుతుంది
Puja Room Vastu: చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు దాని వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పూజగదిలో పొరపాటున కూడా ఈ 4 ఉంచకండి. పూజ గదిలో ఎటువంటి వాటిని ఉంచకూడదనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వాసు ప్రకారం పాటించడం వలన ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. సానుకూల శక్తి కలిగి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఏం చేయాలి? ఏం చేయకూడదు అనేది తెలుసుకుని దానికి తగ్గట్టుగా అనుసరించడం వలన ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండొచ్చు. ఇంటి పూజ గదికి సంబంధించి కొన్ని వాస్తు నియమాలని పాటించడం మంచిది. వీటిని పాటించడం వలన సంతోషంగా ఉండొచ్చు.
పూజ గదిలో ఎప్పుడూ కూడా స్వచ్ఛమైనవి, సాత్వికమైనవి పెట్టాలి. కానీ, చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు దాని వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పూజ గదిలో ఎటువంటి వాటిని ఉంచకూడదనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పూజగదిలో వీటిని ఉంచితే సమస్యలు వస్తాయి
1.ప్లాస్టిక్ లేదా ఇనుము వాటిలో గంగాజలం
చాలా మంది ఇనుము లేదా ప్లాస్టిక్ వాటిల్లో గంగాజలాన్ని నింపి పెడుతూ ఉంటారు. అలా చేయకూడదు. రాగి వాటిలో పెట్టుకుంటే మంచి జరుగుతుంది. కానీ ప్లాస్టిక్ వాటిల్లో ఉంచితే గంగా జలాన్ని అవమానించినట్లు అవుతుంది. ఏడాదంతా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
2.చనిపోయిన పూర్వికులు ఫోటోలు
చాలా మంది దేవుడి గదిలో పూర్వీకుల ఫోటోలని పెడుతుంటారు. అలా చనిపోయిన వారి ఫోటోలను దేవుడి గదిలో పెట్టకూడదు. అలా చేయడం వలన పూజ గదిని అవమానించినట్లు అవుతుంది. వాటిని వేరేగా పెట్టాలి తప్ప దేవుడు గదిలో ఉంచకూడదు.
3.విరిగిపోయిన లేదా పాడైపోయిన విగ్రహాలు
చాలా మందికి పడేయడం ఇష్టం లేక విరిగిపోయిన లేదా పాడైపోయిన దేవుడి విగ్రహాలని పూజ గదిలో పెడుతూ ఉంటారు. అలా చేయడం వలన ప్రతికూల ప్రభావం పడుతుంది. సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
4.బేసి సంఖ్యలో వినాయకుడి విగ్రహాలు
చాలామంది మూడు, ఐదు ఇలా బేసి సంఖ్యలో వినాయకుడి విగ్రహాలు పెడుతూ ఉంటారు. అలా చేయడం మంచిది కాదు. ఒకటి లేదా రెండు వినాయకుడి విగ్రహాలను పూజ గదిలో పెట్టుకోవడం మంచిది. ఎక్కువగా పెడితే ఇబ్బందులు వస్తాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం