హిందూ సంప్రదాయం ప్రకారం ఎవరికి ఏ వేలితో తిలకం వేయాలి? వాటి అర్థం ఏంటి?
హిందూ సంప్రదాయంలో బొట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే సందర్భానికి తగినట్టుగా ఒక్కో వేలితో ఒక్కో సారి తిలకం వేస్తారు. వాటి అర్థం ఏంటి? చనిపోయిన వారికి బొట్టు ఏ వేలితో పెట్టాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం.
మొహానికి బొట్టు ఎంతో అందంగా ఉంటుంది. హిందూ సంస్కృతిలో దీని చాలా గౌరవం ఉంటుంది. నుదుటి మీద తిలకం పెట్టుకున్న వ్యక్తిని చూడగానే మంచి భావన కలుగుతుంది. ఇది కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు. రక్షణ, సానుకూలత, ధైర్యానికి చిహ్నంగా భావిస్తారు.
ఒక్కో వేలితో పెట్టుకునే తిలకానికి ఒక్కో అర్థం ఉంటుంది. ఉదాహరణకు విజయం సాధించాలని కోరుకుంటున్నప్పుడు బొటన వేలితో తిలకం పెడతారు. అయితే ఇది చిన్నగా బొట్టు మాదిరిగా కాకుండా పొడవుగా పెడతారు. బొటన వేలుతో తిలకం పూయడం వల్ల అధికారం, విజయం సాధించమని కోరుకుంటున్నట్టు. దీన్నే వీరతిలకం అంటారు. పురాతన కాలంలో యుద్ధాలకు వెళ్లేటప్పుడు విజయ దీవెనలు ఇస్తూ బొటనవేలుతో నుదుటిపై తిలకం దిద్ది పంపించేవాళ్ళు.
దేవతలకు
పూజ చేసేటప్పుడు దేవతల విగ్రహాలకు బొట్టు పెడతారు. అలాగే మనం కూడా తిలకం పెట్టుకుంటాము. దేవతలు, దేవుళ్ళ విగ్రహాలకు లేదా చిత్రపటాలకు తిలకం పెట్టేటప్పుడు ఉంగరం వేలు ఉపయోగిస్తారు. ఇది భక్తి, నిబద్ధతకు సూచనగా ఉంటుంది. దైవిక వ్యక్తులకు తిలకం వేసేటప్పుడు తప్పనిసరిగా ఉంగరం వేలు మాత్రమే ఉపయోగిస్తారు.
మీ సొంతంగా తిలకం వేసుకునేందుకు
పూజ చేసుకునేటప్పుడు, బయటకు వెళ్లేటప్పుడు దేవుడికి దణ్ణం పెట్టుకుని బొట్టు పెట్టుకుంటారు. ఇలా చేయడం మంచిదని, దైవం ఆశీర్వాదాలు తమకు ఇవ్వమని కోరుకుంటారు. అలా చేస్తున్నప్పుడు ఉంగరం వేలు ఉపయోగించాలి. మీరు మీ నుదుటి మీడ వేరొకరి నుదుటిపై తిలకం పెట్టేటప్పడు ఉంగరం వేలు ఉపయోగించాలి. ఇది తెలివి, మానసిక ఆరోగ్యం, జ్ఞానం వంటి వాటికి చక్రమైన ఆజ్ఞ చక్రాన్ని సంక్రియం చేస్తుందని నమ్ముతారు. దీర్ఘాయువు కోసం ఆశీర్వాదాన్ని ఇస్తున్నందున మీరు మధ్య వేలు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎదుటి వారి నుదుటి మీద తిలకం వేయడం వల్ల వాళ్ళు శాంతి, సంపూర్ణత, దైవానికి దగ్గరగా ఉన్న ఫీలింగ్ అనుభూతి చెందుతారు.
మరణించిన వారికి
చనిపోయిన వారికి, పూర్వీకుల ఫోటోలకు దండ వేసి తిలకం పెడతారు. మరణించిన వ్యక్తికి లేదా వారి చిత్రపటానికి బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలు ఉపయోగించాలని చెబుతారు. సజీవంగా ఉన్న వ్యక్తి నుదుటి మీద తిలకం వేసేటప్పుడు మీరు పొరపాటున కూడా చూపుడు వేలు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది కేవలం మరణించిన వ్యక్తికి బొట్టు పెట్టేటప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు. చూపుడు వేలు మోక్షంతో ముడి పడి ఉంటుంది. చనిపోయిన వారికి ఈ వేలితో బొట్టు పెట్టడం వల్ల వాళ్ళ ఆత్మ సరైన మోక్ష మార్గంలో వెళ్లేందుకు సహాయపడుతుందని అంటారు. అందుకే ఏ వేలితో తిలకం పెడుతున్నారు అనేది చాలా ముఖ్యం.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్