హిందూ పురాణాల ప్రకారం దేవుళ్ళకు రుషులు ఇచ్చిన అత్యంత క్రూరమైన శాపాలు ఏంటి?
శ్రీకృష్ణుడికి గాంధారి పెట్టిన శాపం ఏంటి? దాని వల్ల శ్రీకృష్ణుడు అనుభవించిన ఫలితం ఏంటి? పురాణాలలో ఎవరెవరు రుషుల ఆగ్రహానికి గురై శపించబడ్డారో తెలుసుకుందాం.
నాలుక మీద మచ్చ ఉన్న వాళ్ళు ఏదైనా శాపం పెడితే జరుగుతుందని ఇప్పటికీ చాలా మంది భయపడతారు. అది నిజమో కాదో తెలియదు కానీ హిందూ పురాణాల ప్రకారం దేవుళ్ళు సైతం శాపాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటి ప్రభావంతో జీవితమే కోల్పోయిన వాళ్ళు ఉన్నారు.
పూర్వం రుషులు కోపానికి, నిరుత్సాహానికి గురైనప్పుడు దేవుళ్ళను శపించేవారట. ఇవి చాలా శక్తివంతంగా, ప్రమాదకరంగా, క్రూరమైన పరిణామాలు కలిగి ఉంటాయి. హిందూ గ్రంథాల ప్రకారం, ఇతిహాసాలలో ఎవరు శాపానికి గురైయ్యారు. వాటి పరిణామాలు ఏ విధంగా ఎదుర్కొన్నారో తెలుసుకుందాం.
శకుంతలకు దుర్వాస మహర్షి శాపం
పురాణాల ప్రకారం దుర్వాస మహర్షి ముక్కోపి అనే బిరుదు ఉండేది. ఆయన కోపానికి దేవుళ్ళు సైతం ఆందోళన చెందుతారని అంటారు. అటువంటి మహర్షి కోపానికి శకుంతల బలి అయ్యింది. ఒక నాడు రుషి దుర్వాసుడు శకుంతల ఆశ్రమాన్ని సందర్శించాడు. అప్పుడు ఆమె దుష్యంత రాజు గురించి ఆలోచిస్తూ దుర్వాస మహర్షిని పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన దుర్వాస మహర్షి శకుంతలను శపించాడు. ఆమె ఆలోచిస్తున్న వ్యక్తి ఆమెను పూర్తిగా మర్చిపోతాడని అన్నాడు. ఈ శాపం శకుంతల జీవితాన్ని మార్చేసింది. శాపం ప్రభావం కారణంగా రాజు దుష్యంత్ శకుంతలను గుర్తించలేకపోయాడు. మరొక కథ ప్రకారం దుర్వాస మహర్షి శివుడిని కూడా శపించాడు.
వసులకు వశిష్ఠ మహర్షి శాపం
అష్ట వసువులు దేవతలు. స్వర్గంలో ఉంటారు. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆగ్రహానికి గురయ్యారు. వసులలో ఒకడు వశిష్ఠ మహర్షి దివ్యమైన ఆవును దొంగిలించాడు. దీంతో మహర్షి వారికి కోపం వచ్చింది. వారిని మర్త్యులుగా పుట్టమని శపించాడు. శాపం నుంచి విముక్తి కలిగించమని వెదుకోగా వశిష్ఠుడు పరిహారం వివరించారు. గంగా, రాజు శంతనులకు కుమారులుగా జన్మించామని సెలవిచ్చాడు. అలా వాళ్ళు మళ్ళీ స్వర్గానికి తిరిగి వచ్చారు.
శ్రీకృష్ణుడికి గాంధారి శాపం
కురుక్షేత్ర యుద్ధంలో తన నూరు మంది కుమారులు చనిపోవడానికి కారణమ శ్రీకృష్ణుడేనని కౌరవుల తల్లి గాంధారి ఆగ్రహిస్తుంది. యుద్ధ భూమిలో కుమారుల మృతదేహాలు చూసి దుఃఖం, కోపంతో శ్రీకృష్ణుడిని శపించింది. అతని వంశం ఒకరితో ఒకరు పోరాటం చేసుకుని చనిపోతారని శాపం విధించింది. అలాగే ఒంటరిగా మరణిస్తాడని శపించింది. భగవంతుడైనప్పటికీ శ్రీకృష్ణుడు ఆమె సాపాన్ని అంగీకరించాడు. కృష్ణుడి వంశం యాదవులు ఒకరితో ఒకరు పోరాడుతూ చనిపోయారు. అలాగే వేటగాడి బాణం తగిలి శ్రీకృష్ణుడు ప్రాణాలు విడిచాడు.
అశ్వత్థామకు కృష్ణుడి శాపం
ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామ పాండవుల కుమారులను చంపేస్తాడు. అలాగే యుద్ధంలో ఉపసంహరించుకోవడం తెలియని బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దీంతో కృష్ణుడి ఆగ్రహానికి గురయ్యాడు. 3000 ఏళ్ల పాటు భూమి మీద బాధలు అనుభవిస్తూ జీవించమని శపిస్తాడు. ఇప్పటికీ భూమి మీద అశ్వత్థామ బతికే ఉన్నాడని చెబుతారు.
విష్ణువుకు భృగు ఆచార్యుడి శాపం
మత్స్య పురాణం ప్రకారం దేవతలు, అసురుల మధ్య క్షీర సాగర మథనం జరిగింది. ఆసురులకు సహాయం చేసేందుకు గురువు శుక్రాచార్య శివుడి నుంచి శక్తివంతమైన మంత్రాన్ని కోరాడు. ఆసురులు రక్షణ కోసం భృగు మహర్షి ఆశ్రమంలో ఉన్నారు. ఆ సమయంలో దేవతలు వారిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. తమకు సహాయం చేయమని భృగు మహర్షి ఆశ్రమంలో ఉన్న ఆసురులు అతడి భార్యను శరణు కోరారు. ఆమె శక్తులు ఇంద్రుడిని సైతం కదిలించాయి. భయపడిపోయిన దేవతలు విష్ణుమూర్తిని సహాయం చేయమని కోరారు. భృగు ఆచార్యుడి భార్యపై విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. దీంతో ఆమె శిరస్సు తెగిపోయింది. అది చూసి భృగు మహర్షి విష్ణువును భూమిపై చాలా సార్లు జన్మించి మానవ బాధలను భరించమని శపించాడు.
విష్ణువుకు నారాదుడి శాపం
కొంటె స్వభావానికి పేరు గాంచిన నారద మహర్షి విష్ణువు చేసిన పని వల్ల అవమానానికి గురయ్యాడు. ఒకనాడు నారదుడు యువరాణితో ప్రేమలో పడతాడు. ఆమెను ఆకర్షించేందుకు విష్ణువు సహాయం కోరాడు. నారాదుడికి గుణపాఠం చెప్పాలని భావించిన విష్ణువును అతడి రూపాన్ని వికారంగా మార్చేస్తాడు. దీంతో ఆగ్రహించిన నారదుడు కోపంగా విష్ణువును శపించాడు. రామావతారంతో సీతా దేవి నుంచి వేరుపడి ప్రియమైన వ్యక్తి నుంచి విడిపోవడం జరుగుతుందని శపించాడు. అలా పురాణాలలో చాలా మంది శాపాలకు గురయ్యారు.
టాపిక్