Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఈ 4 పనులను ఎప్పుడూ మధ్యలో వదిలేయకండి, ఇవి పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి
Garuda Puranam: శ్రీమహావిష్ణువు ప్రత్యేకంచి గరుడ పురాణాన్ని చెప్పారని అంటారు. ప్రజల బాగోగుల కోసం, మహావిష్ణువు గరుడ పురాణాన్ని తెలిపారట. గరుడ పురాణం జ్ఞానం, మతం, యాగం, తపస్సు, రహస్యం, విధానం, ఇతర ప్రపంచం గురించి వివరంగా వివరిస్తుంది.
ప్రతీ ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. మీరు కూడా సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? అయితే, కచ్చితంగా ఈ పొరపాట్లు చేయకండి. గరుడ పురాణం ప్రకారం ఈ పనులని ఎప్పుడూ మధ్యలో వదిలివేయకూడదు. అలా వదిలేయడం వలన చాలా నష్టం కలుగుతుంది.

గరుడ పురాణం ఏం చెప్తోంది? ఎలాంటి పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం, మనం వీటిని అనుసరించడం వలన కేవలం మన జీవితాన్ని సరైన దారిలో పెట్టడమే కాకుండా మనం చేసిన పనుల్ని బట్టి చనిపోయిన తర్వాత కలిగే ఫలితాల గురించి కూడా వివరించబడింది.
శ్రీమహావిష్ణువు ప్రత్యేకంచి గరుడ పురాణాన్ని చెప్పారని అంటారు. ప్రజల బాగోగుల కోసం, మహావిష్ణువు గరుడ పురాణాన్ని తెలిపారట. గరుడ పురాణం జ్ఞానం, మతం, యాగం, తపస్సు, రహస్యం, విధానం, ఇతర ప్రపంచం గురించి వివరంగా వివరిస్తుంది. సంతోషకరమైన జీవితానికి సంబంధించిన అనేక రహస్యాలు ఈ పురాణంలో చెప్పబడ్డాయి.
అలాగే అనేక విషయాలు గురించి సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. వీటిని పాటించడం వలన పెద్ద నష్టాల నుంచి బయటపడవచ్చు. గరుడ పురాణంలో చెప్పబడిన విషయాలను పాటించడం వలన అనేక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అయితే, ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో వీటిని వదిలేయకూడదు. ఆ 4 విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1.అప్పు చెల్లించడం
కొంత మంది డబ్బులు లేని సమయంలో ఇతర నుంచి అప్పు తీసుకుంటూ ఉంటారు. అయితే, అప్పుని కచ్చితంగా తిరిగి ఇచ్చేయాలి. ఒకవేళ మీరు ఆలస్యం చేసినట్లయితే వడ్డీ పెరిగిపోతుంది. అలాంటి పరిస్థితిలో బంధాలు దెబ్బతింటాయి.
2.మందులు వేసుకోవడం
అనారోగ్య సమస్య ఉన్నట్లయితే మందుల్ని కచ్చితంగా వాడాలి. అప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్య తగ్గుతుంది. కానీ ఎప్పుడూ మందుల్ని మధ్యలో ఆపేయడం వంటివి చేయకూడదు.
3.మంటని మధ్యలో వదిలేయకూడదు
ఎప్పుడైనా మంట వెలిగిస్తే అది ఆరిపోయే వరకు అక్కడే ఉండాలి. మంటని మధ్యలో ఆర్పకుండా మీరు వచ్చేస్తే అది ప్రమాదకరానికి దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడూ దీనిని కూడా మధ్యలో విడిచి పెట్టకూడదు.
4.శత్రుత్వం
శత్రుత్వాన్ని ముగించకపోతే భవిష్యత్తులో భయంకరమైన పరిణామాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ శత్రువు మీకు హాని చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి శత్రుత్వాన్ని కూడా మధ్యలోనే వదిలేయాలి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం