Feng Shui:ఫెంగ్ షూయి ప్రకారం మీ పర్సు ఇలా ఉంటే డబ్బులు వద్దన్నా వచ్చిపడతాయి
Feng Shui:ఫెంగ్ షూయి ప్రకారం మీ పర్సు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డబ్బు వద్దన్నా వస్తుంది. ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది.
వాస్త్రు శాస్త్రానికి భారతీయులు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో చైనీయులు ఫెంగ్ షూయికి అంత ప్రాధాన్యాత ఇస్తారు. ఫెంగ్ షూయి కేవలం వాస్తు సంబంధిత అంశాలు మాత్రమే కాకుండా అందం, ఐశ్యర్యానికి సంబంధించిన గ్రహ దోషాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ఫెంగ్ షూయి ప్రకారం మీ పర్సు ఇలా ఉంటే డబ్బులు వద్దన్నా వచ్చిపడతాయి. పర్సు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో వాటి ప్రభావాలేంటో వివరంగా తెలుసుకుందాం.
- పర్సు ఉన్న ప్రతి ఒక్కరూ రిచ్ అని చెప్పలేం. కానీ పర్సు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వారు మాత్రం తప్పనిసరిగా ధనవంతులు అవుతారని ఫెంగ్ షూయి చెబుతోంది. పర్సును ఎవరికైనా బహుమతిగా ఇచ్చేటప్పుడు అందులో కనీసం ఒక నాణెమైనా పెట్టాలట. ఇలా చేయడం వల్ల పర్సులో ఎప్పుడూ డబ్బు నిల్వ ఉంటుంది.
- సాధారణంగా పురుషులు తమ వ్యాలెట్ ను ఎప్పుడూ వెనక జేబులో పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల పర్సులో డబ్బు నిలవదట. డబ్బుపైన కూర్చోవడం ఆ మహాలక్ష్మిని అవమానించనట్టే అవుతుందట. ఫలితంగా లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరమై దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది.
- ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేని పర్సు ఉంటుందా అంటే ఉండదని బల్ల గుద్ది మరీ చెప్పచ్చు. డబ్బు ఎప్పుడూ మనతోనే ఉండాలంటే వీటి విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోకతప్పదట. గడువు ముగిసిపోయిన డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు మీ వ్యాలెట్లో అస్సలు ఉంచకూడదు. ఇది మీ డబ్బు ప్రవాహాన్ని ఆపేస్తేంది. పాత ఖర్చుల్లోనే కూడుకుపోయేలా చేస్తుంది.
- పర్సు విషయంలో తీసుకోవలసిన మరో ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే.. పర్సులోని కంపార్టుమెంటులను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. కేవలం ఒకే చోట డబ్బు పెట్టి మిగిలిన కంపార్టుమెంటులను ఖాళీగా వదిలేయం వల్ల ఆదాయ మార్గాలు తగ్గుతాయి. పర్సులోని అన్ని కంపార్టుమెంటులో డబ్బుని ఉంచడం వల్ల ఆదాయ మార్గాలు పెరిగి పర్సులో ఎప్పుడూ డబ్బు ఉంటుంది.
- ఫెంగ్ షూయి ప్రకారం పర్సును ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. ఖాళీ పర్సు దరిద్రాన్ని ఆహ్వానిస్తుంది. డబ్బు నోట్లు లేకపోతే బంగారు రంగులో ఉండే నాణాలను పర్సులో ఎక్కడో ఒక చోట తప్పకుండా ఉంచాలి. ఇది ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరుస్తుంది.
- పర్సుకు జిప్ లేదా బటన్ ఉండటం సహజమే. అయితే వీటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఫెంగ్ షూయి వివరిస్తోంది. పర్సులోని జిప్ లేదా బటన్ సరిగ్గా పనిచేస్తూ ఉండాలి. మూయడం తెరవడం సులభతరంగా ఉండాలి. లేదంటి మీరు మీ డబ్బు విషయంలో నియంత్రణ కోల్పోతారు. జిప్ లేదా బటన్ పాడైపోయిన పర్సులను వదిలేయడమే ఉత్తమం.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.