ఇంటర్వ్యూకి వెళుతున్నారా..? ఈ కలర్ డ్రెస్ వేసుకుని వెళ్లారంటే జాబ్ పక్కా!
లక్కీ నంబర్ల లాగే లక్కీ కలర్స్ కూడా వ్యక్తులకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఇవి వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని, సానుకూలతను పెంచుతాయి. విజయావకాశాలను వృద్ధి చేస్తాయి. ఫెంగ్ షూయి ప్రకారం కొన్ని రంగుల బట్టలు వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్లడం వల్ల జాబ్ కన్ఫామ్ అయ్యే చాన్సెస్ ఎక్కువట.
కొన్ని రంగులు వ్యక్తిలో విశ్వాసాన్ని, శక్తిని, సానుకూలతను పెంచుతాయని ఫెంగ్ షూయి నియమాలు చెబుతున్నాయి. ఇతరుకు మీ మీద అనుకూలమైన ముద్రవేసి విజయానికి చేరువ చేస్తాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు మీకు కలిసొచ్చే రంగులు వేసుకోవడం వల్ల అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలను పెరుగుతాయి. మీరు వేసుకునే బట్టలు ఇతర ఉద్యోగ అభ్యర్థుల నుంచి మిమ్మల్ని వేరుగా ఉంచి సక్సెస్ ను మీకు దగ్గర చేస్తాయి. మీకు తెలియకుండానే మీలో సృజనాత్మకతను, ఉత్సాహాన్ని పెంపొందించి మీ పర్ఫామెన్స్ ను డెవలప్ చేస్తాయి. ఫెంగ్ షూయి ప్రకారం కొన్ని రంగుల దుస్తులు వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్లడం వల్ల జాబ్ దొరికే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆ రంగులేవో తెలుసుకుందాం..
లేత ఆకుపచ్చ రంగు:
ప్రశాంతతకు, సమతుల్యతకు చిహ్నం లేత ఆకుపచ్చ రంగు. ఇది వ్యక్తిలో ఎదుగుదలను సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది. తాజాదనాన్ని, పునరుద్దరణను పెంపొదిస్తుందని ఫెంగ్ షూయి చెబుతోంది. లేత ఆకుపచ్చ రంగు ధరించడం వలన మీరు మరింత రిలాక్స్ గా, ఏకాగ్రతతో ఉండగలుగుతారు. ఈ రంగు మీ నైపుణ్యాన్ని, నేర్చుకోవడంలోని సుముఖతను తెలియజేస్తుంది. సృజనాత్మక, వినూత్న రంగాలలో పాత్రల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ రంగు బాగా కలిసొస్తుంది.
నేవీ బ్లూ కలర్:
ఉద్యోగం కోసం వెళ్లేవారికి నేవి బ్లూ రంగు అదృష రంగు అని ఫెంగ్ షూయి చెబుతోంది. ఇది విశ్వాసాన్ని, నమ్మకాన్ని వెదజల్లుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం నేవీ బ్లూ అనేది నీటి మూలకంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది స్పష్టతను, ప్రశాంతతను సూచిస్తుంది. నేవీ బ్లూ డ్రెస్ వేసుకోవడం వల్ల మీరు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి మరింత బాగా పాల్గొనగలుగుతారు.ఈ రంగు ఇంటర్వ్యూ చేసే వారు మీపై సానుకూల ముద్ర వేసేలా చేస్తుంది. నాయకత్వం, నిర్వహణ వంటి లక్షణాలను కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక.
పసుపు పచ్చ రంగు:
పసుపు ఆశావాదాన్ని, ఉత్సాహాన్ని సూచించే శక్తివంతమైన రంగు. వ్యక్తిని ఉత్తేజితపరిచే శక్తి ఈ రంగుకు ఉంటుంది. పసుపు రంగు సూర్యుడి మూలకంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది వెచ్చదనాన్ని, శక్తిని సూచిస్తుంది. పసుపు రంగును ధరించడం వల్ల మీరు మరింత ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఈ రంగు సానుకూల దృక్పథాన్ని, కొత్త సవాళ్లను స్వీకరించే ఉత్సాహాన్ని తెలియజేస్తుంది. సేల్స్, మార్కెటింగ్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ లో ఉద్యోగం కోరుకునే వారికి ఈ రంగు అదృష్టం కలిగిస్తుంది.
నారింజ రంగు:
నారింజ రంగు సృజనాత్మకత, అభిరుచిని సూచించే డైనమిక్, ఎనర్జిటిక్ రంగు. వాస్తు శాస్త్రం ప్రకారం.. నారింజ అగ్ని మూలకంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది ప్రేరణ, ఉత్సాహాన్ని సూచిస్తుంది. నారింజ రంగు ధరించడం వల్ల మీరు మరింత శక్తివంతంగా, ఉత్సాహంగా కనబడతారు.కళాత్మక, డిజైన్, మీడియా రంగాలలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ రంగు చక్కటి ఫలితాలను ఇస్తుంది.
లేత గోధుమ రంగు:
లేత గోధుమ రంగు లేదా క్రీం రంగు విశ్వసనీయతను సూచించే తటస్థమైన రంగు. ఫెంగ్ షూయి ప్రకారం ఈ రంగు భూమి మూలకంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది వ్యక్తిలోని ఒదుగును, సమతుల్యతను సూచిస్తుంది. లేత గోధుమరంగు లేదా క్రీమ్ రంగు ధరించడం వల్ల మీలో విశ్వాసం పెరిగి మరింత బాగా కంపోజ్ చేయగలుగుతారు. అలాగే ప్రాక్టికల్ గా, భాద్యతాయుతంగా ఉన్నట్టు కనిపిస్తారు. ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్ లేదా హ్యూమన్ రీసౌర్సెస్ లో జాబ్ చేయాలకునే వారికి ఈ రంగు బెస్ట్ ఆప్షన్.