Abhaya Mudra: ఈ ఒక్క ముద్రతో భయం పోతుంది.. ప్రశాంతత, రక్షణ, ధైర్యం కలుగుతాయి.. మీరెప్పుడైనా ట్రై చేసారా?
Abhaya Mudra: అభయ అంటే భయం లేకపోవడం అని అర్థం. హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతంలో కూడా దీనిని మనం చూడొచ్చు. దేవతలు, ఋషులు, సాధువులు, ఆధ్యాత్మిక నాయకులు ఇలా ఎంతో మంది నిష్ణాతులైన మానవులు ఉన్నారు.
మనం హిందూమతంలో చూసుకున్నా బౌద్ధమతంలో చూసుకున్నా వేళ్ళతో చేసే గుర్తులను ముద్ర అని అంటారు. ఎక్కువగా నాట్యాల్లో ముద్రలు కనబడుతూ ఉంటాయి. మన భారతీయ శాస్త్రీయ నాట్యంలో చూస్తే హస్తముద్రంలో ఏకంగా 500 రకాలైన అర్ధాలు కనపడతాయని తెలుస్తోంది.

సంజ్ఞలు వ్యక్తులు తమలో కొంత శక్తిని పంపించడానికి సహాయపడతాయి. ఈ శక్తి ప్రేమ, ధైర్యం, అంగీకారం, విశ్వాసం ఇలా ఎన్నో కావచ్చు. అయితే, యుగ యుగాలుగా ముద్రలని ప్రజలు ఆచరిస్తున్నారు. దృష్టిని పెంచడానికి, ధ్యానం చేయడానికి, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి, ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగిస్తున్నారు.
అభయ ముద్ర అంటే ఏంటి?
హిందీలో భయ్ అంటే భయం. అభయ్ అంటే భయం లేకపోవడం. అభయ ముద్ర అంటే భయం లేకపోవడం అని అర్థం. హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతంలో కూడా దీనిని మనం చూడొచ్చు. దేవతలు, ఋషులు, సాధువులు, ఆధ్యాత్మిక నాయకులు ఇలా ఎంతో మంది నిష్ణాతులైన మానవులు ఉన్నారు. వారు అభయ ముద్ర నైపుణ్యాన్ని అభ్యసించారు. జీవితంలో ధైర్యం యొక్క భావాన్ని సాధించడంలో ప్రజలకి సహాయం చేస్తారు.
అభయ ముద్ర చేసేటప్పుడు ఎలా కూర్చోవాలి?
అభయ ముద్ర చాలా సులువైన ముద్ర. దీనిని మీరు వేయడానికి ముందు ఒక సోఫా లేదా కుర్చీలో లేదా నేలపై కంఫర్ట్ గా కూర్చోవాలి. మీ కుడి చేతిని మీ భుజం ఎత్తుకు తీసుకురావాలి. అరచేతి బయటకు ఎదురుగా ఉండాలి. మీ చెయ్యి స్వేచ్ఛగా వదులుగా ఉండేటట్టు చూసుకోండి. దృఢంగా ఉండకూడదు. ఎడమ చేతిని మోకాలి లేదా తొడలపై ఉంచాలి. ముఖ్యంగా ధ్యానముద్రంలో ఉంచాలి. అలాగే మీ కళ్ళను మూసుకోండి.
అభయ ముద్ర వలన కలిగే లాభాలేంటి?
భయాన్ని తొలగించుకోవడానికి అభయ ముద్ర ఉపయోగపడుతుంది. అభయ ముద్రలో మీరు చేతిని బయటకు చూపించినప్పుడు మీరు మీ భయాన్ని మిమ్మల్ని విడిచిపెట్టినట్లు మీ చేతితో మాట్లాడాలి అని చెప్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా భయాలు వదిలేస్తాయి. అభయ ముద్ర అనేది ప్రజలు కలిగి ఉన్న ధైర్య సాహసాలకు నిచ్చెన లాంటిది. మనసు నుంచి భయం, సందేహాలను విడిచి పెట్టినప్పుడు రక్షణ అనుభవిస్తారు.
1. ప్రశాంతత కోసం
కేవలం భయాన్ని వదలడానికి మాత్రమే కాదు. అభయ ముద్ర వేయడం వలన ప్రశాంతంగా ఉండొచ్చు. మీరు గమనించినట్లయితే వినాయకుడు కూడా అభయ ముద్ర లో కూర్చుంటారు. అభయ ముద్రని వేయడం వలన ధైర్యం వస్తుంది. భయం అంతా కూడా తొలగిపోతుంది.
2. అభయ ముద్రలో బుద్ధుడు
బుద్ధుడితో ఈ అభయ ముద్ర కి సంబంధం ఉంది. బుద్ధుడు మొదట జ్ఞానోదయం పొందాక దీన్ని ఉపయోగించాడు. ఆయనపై దాడి చేయడానికి పంపబడిన ఏనుగుని శాంత పరచడానికి ఈ ముద్రని ఉపయోగించారు. ఈ ముద్ర వేస్తే సామర్థ్యం, బలం కూడా పెరుగుతాయి.
3. ధ్యానం చేసేటప్పుడు అభయ ముద్ర
ధ్యానం చేసేటప్పుడు కూడా అభయ ముద్రని ఉపయోగించవచ్చు. ఈ ముద్రలో కూర్చోవడం వలన చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా భయం లేదా ఆందోళన కలిగినట్లయితే అభయ ముద్రని వేయడం మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం