Solar eclipse: హోలీ తర్వాత అరుదైన సూర్య గ్రహణం.. 70 ఏళ్లలో ఇలాంటిది ఎన్నడూ చూసి ఉండరు-a rare solar eclipse after holi never seen anything like this in 70 years ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  A Rare Solar Eclipse After Holi Never Seen Anything Like This In 70 Years

Solar eclipse: హోలీ తర్వాత అరుదైన సూర్య గ్రహణం.. 70 ఏళ్లలో ఇలాంటిది ఎన్నడూ చూసి ఉండరు

Gunti Soundarya HT Telugu
Mar 18, 2024 05:34 PM IST

Solar eclipse: హోలీ నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది జరిగిన పదిహేను రోజుల తర్వాత అరుదైన సూర్య గ్రహణం ఏర్పడబోతుంది. గత అర్థ శతాబ్ధంలో ఇలాంటిది ఏర్పడలేదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

హోలీ తర్వాత అరుదైన సూర్య గ్రహణం
హోలీ తర్వాత అరుదైన సూర్య గ్రహణం (pixabay)

Solar eclipse: హోలీ పండగ రోజు ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సరిగ్గా 15 రోజుల తర్వాత తొలి సూర్య గ్రహణం ఏర్పడబోతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 8 సూర్యగ్రహణం ఉంటుంది. మరుసటి రోజు నుంచి చైత్ర నవరాత్రుల ప్రారంభం కాబోతున్నాయి. ఈ గ్రహణం గత శతాబ్దంలో అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహంగా నిలవనుంది. 

ట్రెండింగ్ వార్తలు

సుమారు 7:30 నిమిషాల పాటు ఈ సూర్యగ్రహణం జరగనుంది. చివరిసారిగా 1955 లో ఇంతటి సూర్యగ్రహణం ఏర్పడినట్లు  ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడు నిమిషాలు సూర్యగ్రహణం ఉన్న ప్రదేశాలలో పగటి పూట చీకటిగా మారుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఫలితంగా సూతక్ కాలం కూడా చెల్లుబాటు అవదు. అందువల్ల భారత్‌లో ఈ  గ్రహణానికి ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు. అయితే అమెరికాలో ఈ గ్రహణం బాగా కనిపిస్తుంది. పగలు కూడా కాసేపు రాత్రి మాదిరిగా మొత్తం చీకటి కమ్మేస్తుంది. మళ్లీ ఇటువంటి సూర్య గ్రహణం 2030 వరకు ఉండదు. ఉత్తర అమెరికాలోనే కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం స్పష్టంగా కనిపించనుంది. 

ఈ సూర్యగ్రహణం మీన రాశిలో జరగబోతుంది. దీని ప్రభావం మొత్తం 12 రాశుల మీద ఉంటుంది. ఈ ఏడాది వచ్చే మొదటి సూర్యగ్రహణం మూడు రాశుల వారి జీవితంలో అలజడి సృష్టించబోతుంది. ఏ రాశిలో వారికి ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయో చూద్దాం.

వృశ్చిక రాశి 

వృశ్చిక రాశి వారికి మొదటి సూర్యగ్రహణం అశుభప్రదంగా మారనుంది. ఈ రాశి వారికి ఈ సమయం కష్టంగా ఉంటుంది. పని ప్రాంతంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏదైనా నిర్ణయానికి వచ్చేముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. 

తులా రాశి

తులా రాశి జాతకులకు సూర్యగ్రహణం ప్రయోజనకరంగా ఉండదు. వ్యక్తిగత, వృత్తి  జీవితంలో సమస్యలు పెరుగుతాయి. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

వృషభ రాశి 

ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం వృషభ రాశి వారికి అనుకూలమైన సమయంగా ఉండదు. కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. వైవాహక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసర కలహాలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.

వీరికి శుభం

ఈ ఏడాది ఏర్పడే తొలి సూర్య గ్రహణం మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు రాశుల వారికి మేలు చేస్తుంది. సంపదపరంగా పురోగతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ విషయాల్లోనూ సంతృప్తికరంగా ఉంటారు. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. 

మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకున్న వారి కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది. ఆనందంగా ఉంటారు. పురోగతికి బాటలు పడతాయి. ఉద్యోగంలో అధికారుల సహకారంతో ఉన్నత పదవులు పొందుతారు. వ్యాపారస్తులకు ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి. విజయాన్ని అనుకుంటారు.