Mercury transit: కన్యా రాశిలో బుధుడి సంచారం.. మూడు రాశుల అదృష్టం మెరిసిపోతుంది-3 zodiac signs will shine like gold budh transit of mercury horoscope virgo rashifal ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Transit: కన్యా రాశిలో బుధుడి సంచారం.. మూడు రాశుల అదృష్టం మెరిసిపోతుంది

Mercury transit: కన్యా రాశిలో బుధుడి సంచారం.. మూడు రాశుల అదృష్టం మెరిసిపోతుంది

Gunti Soundarya HT Telugu
Aug 15, 2024 09:30 AM IST

Mercury transit: త్వరలో బుధుడు తన స్వంత రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. బుధుడు తన స్వంత రాశిలో సంచరించడం వల్ల 3 రాశుల వారి జీవితం అద్భుతంగా ఉండబోతుంది. అవి ఏ రాశులు, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం.

కన్యా రాశిలోకి బుధుడు
కన్యా రాశిలోకి బుధుడు

Mercury transit: గ్రహాల రాకుమారుడు బుధుడు తన కదలికను మార్చడం అన్ని 12 రాశుల మీద సానుకూల-ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం బుధుడు తిరోగమన స్థితిలో ప్రయాణిస్తున్నాడు. నవగ్రహాలలో సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహం బుధుడు.

మరి కొద్ది రోజుల్లో బుధుడు ఉదయించి తన రాశిని కూడా మార్చుకుంటాడు. బుధుడు రాశి మారడం వల్ల దాని ప్రభావం మేషం నుండి మీనం వరకు ఉన్న రాశులపై కనిపిస్తుంది. త్వరలో బుధుడు తన సొంత రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఏదైనా గ్రహం దాని స్వంత రాశిలో సంచరించడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది అనేక శుభ ఫలితాలను ఇస్తుంది.

సెప్టెంబర్ లో బుధుడు కన్యా రాశికి వెళతాడు. ఇప్పటికే అక్కడ కేతువు సంచరిస్తున్నాడు. ఇది మాత్రమే కాకుండా బుధుడు తన సొంత రాశిలోకి ప్రయవడం వల్ల అత్యంత శుభకరమైన భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. మరికొద్ది రోజుల్లో గ్రహాల రాకుమారుడు కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సుమారు 357 రోజుల తర్వాత బుధుడు తన సొంతరాశిలో సంచరించబోతున్నాడు. కన్యా రాశిలో బుధుడు సంచరించడం వల్ల ఏ రాశుల వారి జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకోబోతున్నాయో తెలుసుకుందాం.

సింహ రాశి

కన్యా రాశిలో బుధుడి సంచారం సింహ రాశి వారికి శుభప్రదంగా పరిగణిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు చదువుపై ఎక్కువగా దృష్టి పెడతారు. మంచి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను ఆర్జించవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. జంక్ ఫుడ్ తినకుండా ఉండండి. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. తల్లిని జాగ్రత్తగా చూసుకోండి.

కన్యా రాశి

బుధుడి సంచారం కన్యా రాశిలోనే జరగబోతుంది. దీని వల్ల ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు చేకూరతాయి. రాబోయే కాలంలో మీరు వేసే ప్రతి వ్యూహం విజయపు సోపానాలను ముద్దాడుతుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి రావచ్చు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉండండి. వ్యాపారంలో కూరుకుపోయిన డబ్బు తిరిగి పొందవచ్చు.

మకర రాశి

కన్యా రాశికి బుధుడు రాశిచక్రం మారడం మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. వ్యాపారంలో డబ్బు విషయంలో నెలకొన్న ఒత్తిడికి తెరపడుతుంది. అదే సమయంలో, మీ జ్ఞానంతో మీరు మీ పనితీరును కూడా మెరుగుపరుస్తారు. మీ జీవిత భాగస్వామికి సమయం ఇవ్వండి.

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.

Whats_app_banner