దేవీ నవరాత్రుల సమయంలో 3 శుభ యోగాలు.. ఈ మూడు రాశులకు సకల శుభాలు
దేవీ నవరాత్రులు ఈనెల 15న ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమయంలో ఏర్పడనున్న మూడు శుభ యోగాలు పలు రాశులకు సకల శుభాలు తేనున్నాయి.
పితృ పక్షం అక్టోబరు 14న ముగుస్తుంది. శరద్ నవరాత్రులు (దేవీ నవరాత్రులు) మరుసటి రోజు అక్టోబరు 15న ప్రారంభమై 23న ముగుస్తాయి. ఈ నవరాత్రుల్లో దుర్గా మాతను వివిధ రూపాల్లో పూజిస్తారు. తద్వారా భక్తులు సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు పొందుతారు. ఇదే సమయంలో జ్యోతిష శాస్త్ర పరంగా మూడు శుభ యోగాలు ఏర్పడబోతున్నాయి. 30 సంవత్సరాల తరువాత ఇలా జరుగుతోందని పండితులు చెబుతున్నారు. బుధాదిత్య యోగం, శశ్ రాజయోగం, భద్ర రాజయోగం ఏర్పడబోతున్నాయి. ఈ యోగాల వల్ల ఏయే రాశుల వారికి మేలు జరుగుతుందో ఇక్కడ తెలుసుకోండి.
మేష రాశి
ఈ దేవీ నవరాత్రుల సమయంలో ఏర్పడే మూడు శుభ యోగాలు మేష రాశి జాతకులకు చాాలా మేలు చేస్తాయి. స్థిర, చరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. భూమి, స్థిరాస్థికి సంబంధించిన ఏదైనా పని నుంచి మీరు లాభం పొందవచ్చు. పదోన్నతి పొందే అవకాశం ఉంది. వ్యాపారులు ఆకస్మిక ధనలాభం పొందుతారు. దుర్గామాత అనుగ్రహం వల్ల మేష రాశి వారికి పెట్టుబడుల నుంచి లాభాలు కలుగుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి జాతకులు శుభ యోగాల వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు. వృషభ రాశి జాతకుల కెరీర్‌కు ఈ సమయం చాలా బాగుంటుంది. కార్యాలయంలో ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. కుటుంబంలో చక్కని వాతావరణం ఉంటుంది. పని చేసే చోట మరిన్ని పెద్ద బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు.
కర్కాటక రాశి
మూడు శుభ యోగాల వల్ల కర్కాటక రాశి జాతకుల ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. చేసే పనిలో విజయం సాధిస్తారు. మీకోరికలు నెరవేరుతాయి. ఏదైనా కొత్త పని లేదా కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి చాలా అనుకూలం. శుభయోగాల సృష్టి వల్ల భౌతిక ఆనందం కలుగుతుంది. తెలివితేటలు, సంపద, ఆధ్యాత్మిక పరంగా మెరుగైన స్థితిని అనుభవిస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబం నుంచి సహకారం లభిస్తుంది.