సెప్టెంబర్ 25, నేటి రాశి ఫలాలు- ఒక రాశి వారు ఈరోజు శుభవార్త వింటారు, కానీ మొహమాటానికి పోయి జేబుని ఖాళీ చేసుకోవద్దు-25th september 2024 today rasi phalalu in telugu check your zodiac signs prediction for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సెప్టెంబర్ 25, నేటి రాశి ఫలాలు- ఒక రాశి వారు ఈరోజు శుభవార్త వింటారు, కానీ మొహమాటానికి పోయి జేబుని ఖాళీ చేసుకోవద్దు

సెప్టెంబర్ 25, నేటి రాశి ఫలాలు- ఒక రాశి వారు ఈరోజు శుభవార్త వింటారు, కానీ మొహమాటానికి పోయి జేబుని ఖాళీ చేసుకోవద్దు

Galeti Rajendra HT Telugu
Sep 25, 2024 12:29 AM IST

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 25.09.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

సెప్టెంబరు 25వ తేదీ రాశిఫలాలు
సెప్టెంబరు 25వ తేదీ రాశిఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 25.09.2024

వారం: బుధ‌వారం, తిథి: అష్టమి,

నక్షత్రం: ఆరుద్ర, మాసం: భాద్రపదము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయనం

మేషం

మనోబలం విజయాన్ని ఇస్తుంది. ఆశించిన ఫలితాలు వరిస్తాయి. ఉద్యోగులు ఎదుగుదలకు ఇదే సరైన సమయం. తోటివారి సాయం అందుతుంది. భాగస్వామ్య వ్యాపారం కలిసొస్తుంది. ధార్మిక చింతనలో కాలం గడుపుతారు. ఆర్థికంగా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. పరిస్థితులకు తగినట్టు వ్యవహరించాలి. మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం.

వృషభం

వ్యాపారయోగం ఉంది. నిర్ణయాలను విజయవంతంగా అమలు చేస్తారు. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ఆశయ సాధనలో ఆత్మీయుల అండదండలు లభిస్తాయి. పనులు వాయిదా వద్దు. ఓర్పు, సహనం చాలా అవసరం. మానసిక ఒత్తిడిని అధిగమిస్తారు. సూర్యనారాయణమూర్తిని ధ్యానించాలి.

మిథునం

జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. పెద్దల ప్రశంసలు అందుతాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. సాహసోపేత నిర్ణయాలు కలిసొస్తాయి. స్థిరాస్తి విలువ పెరుగుతుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. పిల్లల ఎదుగుదల ఆనందాన్నిస్తుంది. పాత పరిచయాలు మేలు చేస్తాయి. నలుగురితో ప్రేమగా సంభాషించండి. విష్ణు సహస్రనామం పఠించాలి.

కర్కాటకం

మనోబలంతో పనులు మొదలు పెట్టండి. ధనధాన్యాభివృద్ధి ఉంది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యులను సంప్రదించండి. కొందరి వల్ల మనశ్శాంతి కరువవుతుంది. అయినా, సంయమనంతో వ్యవహరించాలి. అపార్థాలకు తావివ్వకండి. ఉద్యోగులు పరిస్థితుల్ని బట్టి తమ వ్యూహాలు మార్చుకోవాలి. లక్ష్మీదేవిని ధ్యానించాలి.

సింహం

ఉత్సాహంగా ఉంటారు. దూకుడుగా ఆలోచిస్తారు. మీ మనోబలమే మిమ్మల్ని కాపాడుతుంది. సంపద వృద్ధి చెందుతుంది. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. అధికారులతో సత్సంబంధాలు కొనసాగించాలి. శుభవార్త వింటారు. ఇష్టదైవాన్ని స్మరించండి.

కన్య

సంపదలు వరిస్తాయి. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. ముఖ్య విషయాల్లో అప్రమత్తత అవసరం. కొందరు మీపైన పెత్తనం చెలాయించాలని చూస్తారు. అలాంటి ప్రయత్నాల్ని సున్నితంగా తిరస్కరించండి. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. కష్ట సమయంలో తోబుట్టువులకు మేలు చేస్తారు. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.

తుల

ఉద్యోగంలో ఘన విజయాలు సాధిస్తారు. అధికార యోగం సూచిస్తోంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కొత్త ప్రయోగాలు సఫలం అవుతాయి. తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. మరింత పొదుపు అవసరం. నలుగురి ప్రశంసలూ లభిస్తాయి. మంచి ఆలోచనలను ప్రోత్సహించండి. విఘ్నాలను సులభంగా అధిగమిస్తారు. లక్ష్మీదేవిని ధ్యానించండి.

వృశ్చికం

ముఖ్య విషయాల్లో విజయం మీదే. ఉద్యోగంలో కలిసొస్తుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. అన్నిరంగాల్లోనూ స్థిరమైన ఫలితాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. క్రమంగా ఆశయాలు నెరవేరతాయి. ధనలాభం ఉంది. అయితే, ఆ సంపదను సద్వినియోగం చేసుకోవాలి. ఓ మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవాలి.

ధనుస్సు

మరింత బలమైన ప్రయత్నంతోనే లక్ష్యాలను అధిగమించగలరు. కాలాన్ని వృథా చేసుకోవద్దు. చెడు ఆలోచనలతో మీ బుర్రను కలుషితం చేసేవారు ఉంటారు. వారి పట్ల అప్రమత్తత అవసరం. వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది. అయినా అధిగమిస్తారు. అందర్నీ కలుపుకుని వెళ్లాలి. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి

మకరం

మనోబలమే మిమ్మల్ని నడిపిస్తుంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. భూమి, గృహ, వాహన యోగాలున్నాయి. అధికారుల మెప్పు పొందుతారు. ఒత్తిడిని అధిగమిస్తారు. వ్యాపార విజయానికి మరింత శ్రద్ధ అవసరం. ఇతరుల సలహాలపై ఆధారపడొద్దు. ఓ మేలు జరుగుతుంది. అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించాలి.

కుంభం

అవసరాలకు డబ్బు అందుతుంది. కృషికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వాటిని కచ్చితంగా అమలు చేయండి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలకు ఆస్కారం ఇవ్వకండి. ఆవేశం హద్దులు దాటకుండా జాగ్రత్తపడండి. ఎవరు ఎలా వ్యవహరించినా, మీ పరిధులను మరిచిపోవద్దు. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.

మీనం

ఉద్యోగులకు మంచి ఫలితాలు ఉంటాయి. అధికారుల అండ లభిస్తుంది. నలుగురితో చర్చించి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్ధిక పరిమితులు దాటొద్దు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆశయంపైనే దృష్టి సారించండి. ఓ దశలో దూరమైనవారు సైతం మళ్లీ దగ్గరవుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ