Lucky zodiac signs: ఆగస్ట్ 25 నుంచి ఈ రాశుల వారి సమస్యలకు ఫుల్ స్టాప్ పడబోతుంది, ఇక స్వర్ణ కాలమే-25 august to 18 september is a golden period for these 4 zodiac signs venus will make you rich ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lucky Zodiac Signs: ఆగస్ట్ 25 నుంచి ఈ రాశుల వారి సమస్యలకు ఫుల్ స్టాప్ పడబోతుంది, ఇక స్వర్ణ కాలమే

Lucky zodiac signs: ఆగస్ట్ 25 నుంచి ఈ రాశుల వారి సమస్యలకు ఫుల్ స్టాప్ పడబోతుంది, ఇక స్వర్ణ కాలమే

Gunti Soundarya HT Telugu
Aug 22, 2024 07:21 PM IST

Lucky zodiac signs: సంపదకు కారకుడైన శుక్రుడు ఆగస్ట్ 25న కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అంతుచిక్కని గ్రహం కేతువు ఇప్పటికే కన్యా రాశిలో ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో కన్యారాశిలో శుక్రుడు, కేతువుల కలయిక ఏర్పడుతుంది. కన్యా రాశిలో శుక్రుని సంచారం వల్ల ఏ రాశుల వారు ధనవంతులు అవుతారో తెలుసుకోండి.

కన్యా రాశిలోకి శుక్రుడు
కన్యా రాశిలోకి శుక్రుడు

Lucky zodiac signs: జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు సంపద, విలాసం, వైభవం, ఐశ్వర్యం మొదలైన వాటికి కారణమని వర్ణించారు. ఆగస్ట్ 25వ తేదీ ఉదయం 01:25 గంటలకు శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 02:04 గంటల వరకు శుక్రుడు కన్యా రాశిలో ఉంటాడు.

కన్యా రాశిలో ఇప్పటికే కేతువు సంచరిస్తున్నాడు. శుక్రుడు ప్రవేశించిన వెంటనే కేతు శుక్ర సంయోగం జరుగుతోంది. ఈ రెండు గ్రహాల కలయిక కొన్ని రాశుల వారిని ధనవంతులను చేయబోతుంది. కన్యా రాశిలో శుక్రుని సంచారంతో కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురయితే మరికొందరికి మాత్రం అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి. ఈ రాశుల వారికి శుభవార్తలతో పాటు డబ్బు సంపాదించేందుకు మంచి అవకాశాలు లభిస్తాయి. కన్యా రాశిలో శుక్రుని సంచారం ఏ రాశుల వారికి మేలు చేస్తుందో తెలుసుకోండి.

వృషభ రాశి

కన్యా రాశిలో శుక్రుడి సంచారంతో వృషభ రాశి వారికి అదృష్టం మెరుగుపడుతుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి ఇది మంచి సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయి. వ్యాపారులకు భారీ లాభాలు వస్తాయి. కెరీర్ ఊపందుకుంటుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి శుక్రుని సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శుక్రుని ప్రభావం కారణంగా మీరు మీ వృత్తిలో పురోగతిని, కార్యాలయంలో ప్రశంసలను పొందవచ్చు. వృత్తిపరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. డబ్బు వస్తుంది, మీరు పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. కుటుంబ జీవితంలోని సమస్యలు సమసిపోతాయి. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి.

కన్యా రాశి

శుక్రుడు కన్యా రాశిలోనే సంచరిస్తాడు. అటువంటి పరిస్థితిలో ఈ సంచారం మీకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. శుక్రుడి ప్రభావం వల్ల మీ ప్రేమ జీవితం మెరుగుపడుతుంది. వ్యాపారులు లాభాలను ఆశిస్తున్నారు. ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం. డబ్బు సంపాదించడానికి కొత్త వనరులు కనిపిస్తాయి. ఉద్యోగులకు విజయం, ప్రమోషన్ రెండూ లభించడంతో మనసు ఊరట చెందుతుంది. ఆందోళనల నుంచి బయటపడతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

వృశ్చిక రాశి

కన్యా రాశిలో శుక్రుని సంచారం వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా చాలా శుభప్రదం కానుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. వివాహం స్థిరపడవచ్చు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం ఆఫర్లను పొందవచ్చు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. శుభవార్త ఆశించవచ్చు. దీర్ఘకాలంగా వాయిదా పడుతూ వస్తోన్న పనులు ఈ సమయంలో పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. శుక్రుడి ప్రభావంతో ప్రేమికులు రొమాన్స్ లో మునిగిపోతారు. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు రెట్టింపు అవుతాయి.

ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.