2025: ఇది కుజుడి సంవత్సరం.. కోపం, చెడు అలవాట్లను వదిలివేయండి, లేకపోతే ఇబ్బందులు కలగవచ్చు చూసుకోండి
2025: కుజుడి సంఖ్యగా దీనిని పరిగణిస్తారు. 2025 సంవత్సరం కుజుడి సంవత్సరం, అంటే మనం 2025ని జోడిస్తే 2+0+2+5=9. అంగారకుడుని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒకరి జాతకంలో కుజుడు అశుభ స్థానంలో ఉన్నట్లయితే అది అతనికి చిన్న బుద్ధిని కలిగిస్తుంది.
2025 వచ్చేసింది. ఈ ఏడాదికి అధిపతి అంగారక గ్రహం. అంగారక గ్రహం బలహీనంగా ఉంటే దురదృష్టం కలుగుతుంది. అయితే, కొత్త సంవత్సరం కొన్ని విషయాలకి దూరంగానే ఉంటే మంచిది. వాటి గురించి ఇప్పుడే తెలుసుకుందాం. న్యూమరాలజీ ప్రకారం 2025 సంఖ్య వచ్చేసి 9.
అంగారకుడి సంఖ్యగా దీనిని పరిగణిస్తారు. 2025 సంవత్సరం అంగారకుడి సంవత్సరం, అంటే మనం 2025ని జోడిస్తే 2+0+2+5=9. అంగారకుడుని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒకరి జాతకంలో కుజుడు అశుభ స్థానంలో ఉన్నట్లయితే అది అతనికి చిన్న బుద్ధిని కలిగిస్తుంది. చిన్న విషయాలకే కోపం వస్తుంది.
కొత్త సంవత్సరంలో పుట్టిన సంఖ్య 9 కానీ రాశి చక్రం కుజుడు ఉన్నవారు 2025 సంవత్సరంలో తమని తాము కోపానికి దూరంగా ఉంచుకోవడం మంచిది.
కుజుడు చెడుగా ఉంటే ఒక వ్యక్తి కోపంతో ప్రవర్తిస్తాడు.
అలాగే కుజుడు చెడుగా ఉన్నట్లయితే వివాహంలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ సంబంధం కావచ్చు లేదంటే మీ వివాహాన్ని ఖరారు చేయడంలో కూడా సమస్యల్ని ఎదుర్కోవచ్చు.
2025లో చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అలాగే వీరు మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది.
మద్యం లేదా మత్తు పదార్థాలని తీసుకోకుండా ఉండాలి. వీటికి దూరంగా ఉండడం మంచిది లేకపోతే బాధపడాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి.
కుజుడు మొత్తం ఈ ఏడాది ఏడు సార్లు సంచరిస్తాడు. 2025 జనవరి 23 నుండి 2025 ఏప్రిల్ 7 వరకు, మిథున రాశిలో ఉంటుంది. ఆ తరవాత కర్కాటకంలో కుజ సంచారం 7 ఏప్రిల్ 2025, నుంచి 9 జూన్ 2025 వరకు ఉంటాడు. సింహ రాశిలో కుజ సంచారం 9 జూన్ 2025 నుంచి 31 జూలై 2025 వరకు ఉంటుంది. 2025 సెప్టెంబర్ 15, గురువారం ఉదయం 6:09 గంటల నుంచి రాత్రి 10:01 గంటల వరకు కన్యారాశిలో కుజ సంచారం ఉంటుంది.
తర్వాత కుజ సంచారం 15 సెప్టెంబర్ 2025 నుంచి 28 అక్టోబర్ 2025 మంగళవారం వరకు తులా రాశిలో ఉంటుంది. వృశ్చికంలో కుజ సంచారం 28 అక్టోబర్ 2025 నుండి 7 డిసెంబర్ 2025 వరకు ఉంటుంది. ఆ తరవాత ధనుస్సు రాశిలో కుజుడి సమాచారం ఉంటుంది. ఇలా మొత్తం కుజుడు ఏడు సార్లు సంచరిస్తాడు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం