ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యం. పెళ్లి తర్వాత ప్రతీ ఒక్కరి జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. పెళ్లితో రెండు మనసులు మాత్రమే కాదు రెండు కుటుంబాలు కూడా ఒకటవుతాయి. పెళ్లి అంటే జాతకాలు చూసుకోవడం మొదలు ముహూర్తాలు వరకు ఎంతో ఉంటుంది.
ముహూర్తం చూసి మాత్రమే పెళ్లి జరుపుతారు. ఏప్రిల్ నెల ఇక ముగుస్తోంది. మే నెల వచ్చేస్తోంది. మే నెలలో ఉన్న పెళ్లిళ్ల ముహూర్తాల గురించి పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. మే లో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు. 15 ముహూర్తాలు వరకు ఉన్నాయి. మరి మే నెలలో ఉన్న పెళ్లి ముహూర్తాల వివరాలను చూసేద్దాం.
మే 1, 2025 గురువారం
మే 5, 2025 సోమవారం
మే 6, 2025, మంగళవారం
మే 8, 2025, గురువారం
మే 10, 2025, శనివారం
మే 14, 2025, బుధవారం
మే 15, 2025, గురువారం
మే 16, 2025, శుక్రవారం
మే 17, 2025, శనివారం
మే 18, 2025, ఆదివారం
మే 22, 2025, గురువారం
మే 23, 2025, శుక్రవారం
మే 24, 2025, శనివారం
మే 27, 2025, మంగళవారం
మే 28, 2025, బుధవారం
జూన్ లో 5 శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఆ తరవాత 4 నెలలు జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఎటువంటి శుభ ముహూర్తాలు ఉండవు. జూలై 6న దేవశయని ఏకాదశి వస్తుంది. ఆ రోజు విష్ణువు పాతాళ లోకానికి వెళ్లిపోతాడు. నాలుగు నెలలపాటు యోగ నిద్రలో ఉంటాడు.
కనుక చాతుర్మాసంలో శుభకార్యాలు చేయకూడదు. మళ్ళీ దేవుత్తని ఏకాదశి నాడు విష్ణువు మేల్కొంటాడు. ఆరోజు తులసిని పెళ్లి చేసుకున్నాడని చెబుతారు. ఈ కారణంగా శుభకార్యాలు మళ్లీ నవంబర్ నుండే మొదలవుతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం