మనకి మొత్తం 12 రాశులు ఉంటాయి. 12 రాశులకు ఆయా రాశుల ఆధారంగా గ్రహాలు, దేవతలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అయితే ద్వాదశ రాశులకు ఏ దేవత అధిపతి, ఎవరు రక్షిస్తారు, ఎవరి ఆశీస్సులు మనపై ఉంటాయి ఇలాంటి విషయాలను తెలుసుకోవచ్చు. ఏ దేవత ఏ రాశి వారికి అనుగ్రహాన్ని కలిగించి సంతోషంగా ఉంచుతుంది అనేది చూద్దాం.
మేష రాశిని పరిపాలించే గ్రహం కుజుడు. కుజుడు అనుగ్రహంతో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారు దృఢ నిశ్చయంతో ఉంటారు, పైగా ధైర్యవంతులు కూడా. దుర్గాదేవి మేష రాశి వారికి ధైర్యం, బలాన్ని అందిస్తుంది.
వృషభ రాశిని పరిపాలించేది శుక్రుడు. శుక్రుడు విలాసాలను అందిస్తాడు. లక్ష్మీదేవి వృషభ రాశి వారితో ఉండాలని అనుకుంటుంది. లక్ష్మీదేవి స్థిరత్వాన్ని, శ్రేయస్సును సూచిస్తుంది.
మిథున రాశి వారిని బుధుడు పాలిస్తాడు. సరస్వతీ సంభాషణ, జ్ఞానాన్ని సూచిస్తుంది. కనుక సరస్వతీ దేవితో ఈ రాశి వారు అనుసంధానం చేయబడి ఉంటారు. వీరి జీవితంలో త్వరగా అభివృద్ధి పొందుతారు.
కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి. కర్కాటక రాశి వారు పార్వతీ దేవిని ఆరాధిస్తే మంచిది. పార్వతీ దేవి కుటుంబ సామరస్యాన్ని, పోషణను సూచిస్తుంది.
సింహ రాశి వారిని సూర్యుడు పాలిస్తాడు. కాళీ దేవత వారితో అనుసంధానం అవ్వాలని అనుకుంటుంది. ఈ రాశి వారు కాళీ మాతను ఆరాధించడం వలన మంచి ఫలితం ఉంటుంది.
కన్యా రాశి వారిని బుధుడు పాలిస్తాడు. అన్నపూర్ణ దేవితో కన్యా రాశి వారికి సంబంధం కలిగి ఉంటుంది. కన్యా రాశి వారు అన్నపూర్ణ దేవిని ఆరాధించడం వలన మంచి జరుగుతుంది.
తులా రాశి వారికి శుక్రుడు అధిపతి. శుక్రుడు ప్రేమ, అందానికే కారకుడు. ఈ రాశి వారు రతీ దేవిని ఆరాధిస్తే మంచిది.
వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారు చాముండేశ్వరిని క్రమం తప్పకుండా ఆరాధించడం వలన మంచి ఫలితం ఉంటుంది.
ధనస్సు రాశి వారికి అధిపతి గురువు. ధనస్సు రాశి వారు సరస్వతీ దేవితో అనుసంధానం అయితే మంచిది. విశేష ఫలితాలను పొందవచ్చు.
మకర రాశి వారిని శనిదేవుడు పాలిస్తాడు. క్రమశిక్షణ, బాధ్యత వహించే దుర్గాదేవి వీరితో ఉండాలని అనుకుంటుంది. దుర్గాదేవిని మకర రాశి వారు ఆరాధిస్తే మంచిది.
కుంభ రాశి అధిపతి శని దేవుడు. ఈ రాశి వారు మాతంగీ దేవిని ఆరాధిస్తే మంచిది. సంతోషంగా ఉండచ్చు.
మీన రాశి వారికి అధిపతి గురువు. లక్ష్మీదేవి మీన రాశి వారికి ఆశీర్వాదాలను ఇవ్వాలని అనుకుంటుంది. కాబట్టి లక్ష్మీదేవిని ఈ రాశి వారు ఆరాధిస్తే మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్