12 Months 12 Grapes: కొత్త సంవత్సరం సంతోషంగా ఉండాలంటే 12 ద్రాక్ష పండ్లు తింటారట.. ఈ వింత సంప్రదయం గురించి విన్నారా?
12 Months 12 Grapes: 12 ద్రాక్ష పండ్లను తింటే ఏడాది అంతా సంతోషంగా ఉండొచ్చు అని ఈ వీడియోలో తెలుపుతున్నారు. అలాగే వారి యొక్క కలలు, ఆశయాలు కూడా నెరవేరుతాయి అని నమ్ముతున్నారు. 12 సెకండ్లలో 12 ద్రాక్ష పండ్లను తినాలని కొంత మంది చెప్తుంటే 12 నిమిషాలలో 12 ద్రాక్ష పండ్లను తినాలని మరి కొందరు చెప్తున్నారు
మనకి తెలియని చాలా సంప్రదాయాలు ఉన్నాయి. ఒక్కో చోట ఒక్కో రకమైన పద్దతిని అనుసరిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఒక పురాతన పద్ధతికి సంబంధించి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ పద్ధతిని చూసారంటే మీరు కూడా షాక్ అయిపోతారు. ఇంటర్నెట్లో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
12 ద్రాక్ష పండ్లను తింటే ఏడాది అంతా సంతోషంగా ఉండొచ్చు అని ఈ వీడియోలో తెలుపుతున్నారు. అలాగే వారి యొక్క కలలు, ఆశయాలు కూడా నెరవేరుతాయి అని నమ్ముతున్నారు. 12 సెకండ్లలో 12 ద్రాక్ష పండ్లను తినాలని కొంత మంది చెప్తుంటే 12 నిమిషాలలో 12 ద్రాక్ష పండ్లను తినాలని మరి కొందరు చెప్తున్నారు.
స్పానిష్ సంప్రదాయం
కొత్త సంవత్సరం నాడు 12 ద్రాక్ష పండ్లను తింటే సంవత్సరం అంతా అదృష్టం కలుగుతుందని.. రానున్న 12 నెలలు కూడా సంతోషంగా ఉండాలని అలా చేస్తున్నట్లు వీడియోలో చెప్పబడింది.
స్పానిష్ సంప్రదాయం ప్రకారం, ఈ పద్ధతిని చాలామంది అనుసరిస్తున్నారు. 19వ శతాబ్దం నుంచి ఈ పద్ధతిని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. 12 ద్రాక్ష పండ్లలో ఒక్కో ద్రాక్ష పండు ఒక్కొక్క కోరిక అని చెప్తున్నారు.
ఇలా ద్రాక్ష పండ్లను కొత్త సంవత్సరం మొదటి రోజు తినడం వలన 12 నెలలు కూడా సంతోషంగా ఉండొచ్చని.. అనుకున్నవి జరుగుతాయని వారు నమ్మకం వారి నమ్మకం.
ద్రాక్ష పండ్లను తింటే ఇలా జరుగుతుందట
ద్రాక్ష పండ్లను తింటే అదృష్టం కలిసి వస్తుందని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని.. ధనం వారి ఇంట ఉంటుందని నమ్ముతున్నారు.
అలాగే ఇలా ఈ పద్ధతిని ఫాలో అవ్వడం వలన అదృష్టం వారి వెంట ఉంటుందని.. వారి ప్రేమికులని కలుసుకుంటారని చాలా మంది నమ్ముతున్నారు.
ఇంకొంత మంది అభిప్రాయం ప్రకారం కేవలం ద్రాక్ష పండ్లు అమ్మేవారు సేల్స్ పెరగాలని ఇలా చేస్తున్నారని అంటున్నారు. 12 ద్రాక్ష పండ్లను తినేటప్పుడు టేబుల్ కింద కూర్చొని తినాలని కొంత మంది చెప్తున్నారు.
అర్ధరాత్రి 12 గంటలకు ఈ 12 ద్రాక్ష పండ్లను తింటే సంవత్సరం అంతా సంతోషంగా ఉంటారని చాలా మంది దీనిని ఫాలో అవుతున్నారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం
టాపిక్