Lucky Zodiac Signs: సెప్టెంబర్‌లో ఈ రాశుల వారికి పెరగనున్న అదృష్టం.. ధనప్రాప్తితో పాటు..!
Lucky Zodiac Signs: సెప్టెంబర్ నెలలో కొన్ని రాశుల వారికి అదృష్టం ఎక్కువగా కలిసి రానుంది. బుధుడి సంచారం వీరికి మేలు చేయనుంది. ధనంతో పాటు మరిన్ని విషయాల్లో ప్రయోజనాలు దక్కే అవకాశాలు ఉన్నాయి.
(1 / 6)
జ్యోతిష శాస్త్రం ప్రకారం, బుధుడి సంచారం అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. బుధుడు సెప్టెంబర్ 4వ తేదీన సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉండగా.. సింహంలోకి అడుగుపెట్టనున్నాడు.
(2 / 6)
సింహరాశిలో బుధుడి సంచారం కొన్ని రాశులకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 23 ఉదయం వరకు సింహ రాశిలో బుధుడు ఉంటాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు చేకూరుతాయి.
(3 / 6)
కర్కాటక రాశి: సింహ రాశిలో బుధుడి సంచారం కర్కాటక రాశి వారికి మేలు చేస్తుంది. ఈ సమయంలో వీరికి వ్యాపారాల్లో లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు దక్కొచ్చు. గతం కంటే ధనం అధికమవుతుంది.
(4 / 6)
సింహం: ఈ కాలంలో సింహ రాశి వారికి కూడా మేలు జరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ పరంగా బాగుంటుంది. ఆదాయం, పొదుపు రెండూ పెరుగుతాయి. దంపతుల మధ్య సాన్నిహిత్యం మరింత మెరుగవుతుంది. అన్ని రకాలుగా ఈ కాలంలో సంతోషం దక్కే అవకాశాలు ఉంటాయి.
(5 / 6)
మేషరాశి: ఈ కాలంలో వీరికి మానసిక ప్రశాంతత ఉంటుంది. చాలా కాలంగా ఉన్న కొన్ని ఆందోళనలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. కెరీర్ పరంగా ప్రయోజనాలు ఉండొచ్చు. చేసే పనుల్లో సంతృప్తి ఉంటుంది. వ్యాపారాలు చేసే వారికి లాభం ఆశించిన స్థాయిలో ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
(6 / 6)
మిథునం: సింహంలో బుధుడి సంచార కాలంలో మిథున వారికి కలిసి వస్తుంది. వృత్తిపరంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. సందేహాలు, వ్యక్తిగత ప్రభావాల గురించి తెలుసుకోవాలనుకుంటే సంబంధిత నిపుణులను సంప్రదించొచ్చు.)
ఇతర గ్యాలరీలు