China Covid Protest: చైనాలో విస్తరిస్తున్న ఆందోళనలు.. తిరగబడుతున్న ప్రజలు-zero covid policy draws to massive protests across china ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  China Covid Protest: చైనాలో విస్తరిస్తున్న ఆందోళనలు.. తిరగబడుతున్న ప్రజలు

China Covid Protest: చైనాలో విస్తరిస్తున్న ఆందోళనలు.. తిరగబడుతున్న ప్రజలు

Updated Nov 27, 2022 11:26 PM IST Chatakonda Krishna Prakash
Updated Nov 27, 2022 11:26 PM IST

  • China Covid Protest: జీరో కొవిడ్ పాలసీ (Zero Covid Policy) కి వ్యతిరేకంగా చైనాలో ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. క్రమంగా అన్ని నగరాలకు నిరసనలు వ్యాపిస్తున్నాయి. వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. సుదీర్ఘ క్వారంటైన్‍లు, లాక్‍డౌన్లు, టెస్టింగ్ కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నారు. అధ్యక్షుడు షీ జిన్‍పింగ్ పదవి నుంచి దిగిపోవాలని కూడా నినదిస్తున్నారు. సాధారణంగా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ పట్ల అక్కడి ప్రజలు బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేయరు. అయితే జీరో కొవిడ్ పాలసీ విషయంలో మాత్రం చైనా ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.  ‘ఉరుమ్‍కి’ నగరంలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 10 మంది చనిపోయారు. లాక్‍డౌన్ కారణంగానే సహాయక చర్యలు సరిగా జరగలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు క్రమంగా చాలా నగరాలకు ఈ ఆందోళనలు విస్తరిస్తున్నాయి.

జియాంగ్సూ ప్రావిన్స్ లోని నాన్‍జింగ్‍లో ఉన్న కమ్యూనికేషన్స్ యూనివర్సిటీ ఆఫ్ చైనా వద్ద నిరసన వ్యక్తం చేసిన చైనీయులు.

(1 / 6)

జియాంగ్సూ ప్రావిన్స్ లోని నాన్‍జింగ్‍లో ఉన్న కమ్యూనికేషన్స్ యూనివర్సిటీ ఆఫ్ చైనా వద్ద నిరసన వ్యక్తం చేసిన చైనీయులు.

బ్లాంక్ షీట్లను ఉపయోగించి జీరో కొవిడ్ విధానానికి వ్యతిరేకంగా బీజింగ్‍లో ఆందోళన నిర్వహించారు విద్యార్థులు.

(2 / 6)

బ్లాంక్ షీట్లను ఉపయోగించి జీరో కొవిడ్ విధానానికి వ్యతిరేకంగా బీజింగ్‍లో ఆందోళన నిర్వహించారు విద్యార్థులు.

ఉరుమ్‍కీ వీధుల్లో ఆందోళన చేస్తున్న ప్రజలను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు.

(3 / 6)

ఉరుమ్‍కీ వీధుల్లో ఆందోళన చేస్తున్న ప్రజలను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు.

చైనాలోని బీజింగ్‍లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుండగా.. ప్రొటెక్టివ్ సూట్ వేసుకొని వీధిలోనే నిద్రిస్తున్న ఓ ఉద్యోగి. 

(4 / 6)

చైనాలోని బీజింగ్‍లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుండగా.. ప్రొటెక్టివ్ సూట్ వేసుకొని వీధిలోనే నిద్రిస్తున్న ఓ ఉద్యోగి. 

షాంఘైలో నిరసనలను కట్టడి చేసేందుకు వీధులను బ్లాక్ చేసిన పోలీసులు.

(5 / 6)

షాంఘైలో నిరసనలను కట్టడి చేసేందుకు వీధులను బ్లాక్ చేసిన పోలీసులు.

బీజింగ్‍లోని సింఘువా యూవర్సిటీకి వెళ్లే మార్గంలో ఫొటోలు తీయడాన్ని ఓ సెక్యూరిటీ ఆఫీసర్ అడ్డుకున్నారు. 

(6 / 6)

బీజింగ్‍లోని సింఘువా యూవర్సిటీకి వెళ్లే మార్గంలో ఫొటోలు తీయడాన్ని ఓ సెక్యూరిటీ ఆఫీసర్ అడ్డుకున్నారు. 

ఇతర గ్యాలరీలు