(1 / 7)
కాలానుగుణంగా అంతరించిపోతున్న ఆకుకూరలకు పూర్వ వైభవమే లక్ష్యంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని డిడికి గ్రామంలో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలో సాగు చేయని ఆకుకూరల పండగను ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో 40 రకాలకు పైగా సహజసిద్ధంగా పండే ఆకుకూరలను ప్రదర్శించి, వాటిలో ఉండే పోషక విలువల గురించి వివరించారు. ఈ ఆకుకూరల ఉత్సవంలో 150 మందికి పైగా రైతులు, శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు పాల్గొన్నారు.
(2 / 7)
ఈ ఆకుకూరలకు విత్తనాలు చల్లడం, నీరు పెట్టాల్సిన అవసరం లేదు. పొలాల గట్లపై, అడవులలో వాటంతట అవే మొలకెత్తుతాయి. కావున ప్రస్తుత కాలంలో అవి ఎవరికి తెలియక పోవడంతో కలుపు మొక్కలుగా భావిస్తున్నారు. మనకు బాగా తెలిసిన పాలకూర, కొత్తిమీర, తోటకూర, ఉసిరి వంటి వాటి కన్నా నాలుగు-అయిదు రెట్లు ఎక్కువ పోషకాలు ఈ ఆకుకూరలలో ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ (NIN) తెలిపింది. ఈ కార్యక్రమంలో పోషకాహార నిపుణులు డా.సలోమి యేసుదాస్ మాట్లాడుతూ.. డీడీఎస్ 20 ఏండ్ల ముందు ఈ సాగు చేయని ఆకుకూరలపై పరిశోధన మొదలుపెట్టారని తెలిపారు. ఈ ఆకుకూరలతో ఉండే పోషకాల గురించి వివరించారు. కాలానుగుణంగా దొరిగే వీటిని వండుకొని తినడం వలన ఆయా కాలాల్లో వచ్చే అనారోగ్య సమస్యలకు ఔషధాలుగా పనిచేస్తాయన్నారు.
(3 / 7)
ఈ ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు పొట్పల్లి ఊర్లో జీవవైవిధ్య పొలాలను సందర్శించారు. అక్కడి సంఘం మహిళా రైతులతో మాట్లాడి వివిధ రకాల ఆకు కూరలు, వాటి ఉపయోగాలు, అవి వండుకునే విధానంపై అవగాహన పెంచుకున్నారు. ఇలా చేనులోనే చూడటం రైతుల నుంచే వినటం చాలా మంచి అనుభవం” అని సందర్శకులు అన్నారు.
(5 / 7)
ఆ కార్యక్రమానికి వచ్చిన సందర్శకులకు 20 రకాల ఆకుకూరలతో డీడీఎస్ సభ్యులు స్పెషల్ మిల్లెట్ లంచ్ ను ఏర్పాటు చేశారు.
(6 / 7)
ఆకుకూరల పండుగకు వచ్చిన సందర్శకులు స్పెషల్ మిల్లెట్ లంచ్ ను తిని ఎంతో సంతోషించారు. సందర్శకులకు లంచ్ తో పాటు ఆకుకూరలపై షార్ట్ ఫిల్మ్ చూపించారు.
ఇతర గ్యాలరీలు