Dhanashree Verma: ధ‌న‌శ్రీ వ‌ర్మ మొత్తం ఆస్తుల విలువ ఎంతంటే? - చాహ‌ల్‌కు ధీటుగా!-yuzvendra chahal vs dhanashree verma net worth and assets ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Dhanashree Verma: ధ‌న‌శ్రీ వ‌ర్మ మొత్తం ఆస్తుల విలువ ఎంతంటే? - చాహ‌ల్‌కు ధీటుగా!

Dhanashree Verma: ధ‌న‌శ్రీ వ‌ర్మ మొత్తం ఆస్తుల విలువ ఎంతంటే? - చాహ‌ల్‌కు ధీటుగా!

Jan 05, 2025, 09:27 PM IST Nelki Naresh Kumar
Jan 05, 2025, 09:27 PM , IST

Dhanashree Verma: టీమిండియా క్రికెట‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్, ధ‌న‌శ్రీ వ‌ర్మ విడాకులు తీసుకుంటున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఉన్న భార్య ధ‌న‌శ్రీ వ‌ర్మ ఫొటోల‌ను చాహ‌ల్ ఇటీవ‌ల డిలీట్ చేయ‌డంతో విడాకుల పుకార్లు మొద‌ల‌య్యాయి.

 ఇన్‌స్టాగ్రామ్‌లో చాహ‌ల్‌, ధ‌న‌శ్రీ వ‌ర్మ ఒక‌రినొక‌రు అన్‌ఫాలో చేసుకున్నారు. 

(1 / 6)

ధ‌న‌శ్రీ వ‌ర్మ‌ను ప్రేమించిన చాహ‌ల్ 2020లో ఆమెను పెళ్లాడాడు. లాక్‌డౌన్ టైమ్‌లో ధ‌న‌శ్రీ వ‌ర్మ ద‌గ్గ‌ర డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు చాహ‌ల్‌. ఈ టైమ్‌లోనే వీళ్ల మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. 

(2 / 6)

ధ‌న‌శ్రీ వ‌ర్మ బీడీఎస్ పూర్తిచేసింది. కొరియోగ్ర‌ఫీపై ఆస‌క్తితో డెంట‌ల్ డిగ్రీని ప‌క్క‌న‌పెట్టి డ్యాన్స్ ఆకాడెమీ ప్రారంభించింది. ప్రియాంక చోప్రా, శ్ర‌ద్ధాక‌పూర్‌, అలియా భ‌ట్ వంటి బాలీవుడ్‌ స్టార్ల‌కు ప‌ర్స‌న‌ల్ కొరియోగ్రాఫ‌ర్‌గా ధ‌న‌శ్రీ వ‌ర్మ ప‌నిచేసింది 

(3 / 6)

ధ‌న‌శ్రీ వ‌ర్మ యూట్యూబ్ ఛానెల్‌కు 2.79 మిలియ‌న్ల స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 6.2 మిలియ‌న్లు ఫాలోవ‌ర్స్ ఆమె ఖాతాను అనుస‌రిస్తోన్నారు. 

(4 / 6)

ధ‌న‌శ్రీ వ‌ర్మ మొత్తం ఆస్తులువిలువ  ఇర‌వై ఐదు కోట్ల‌కుపైనే ఉన్న‌ట్లు స‌మాచారం. చాహ‌ల్‌కు ఆస్తి 45 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని చెబుతోన్నారు. చాహ‌ల్‌కు ధీటుగానే ధ‌న‌శ్రీ వ‌ర్మ‌కు ఆస్తులు ఉన్న‌ట్లు తెలిసింది. 

(5 / 6)

ధ‌న‌శ్రీ వ‌ర్మ త్వ‌ర‌లోనే తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఆకాశం దాటి వ‌స్తావా సినిమాలో న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు