Yuzvendra Chahal Divorce: నన్ను మధ్యలోకి లాగితే బాగుండదు.. క్రికెటర్ చహల్‌తో డేటింగ్ వార్తలపై ఆర్జే వార్నింగ్
- Yuzvendra Chahal Divorce: యుజ్వేంద్ర చహల్, ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్న విషయం తెలుసు కదా. ఈ విడాకులకు ఆర్జే మహావష్ తో చహల్ డేటింగే కారణమన్న పుకార్లు కూడా వచ్చాయి. దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ గట్టి వార్నింగ్ ఇచ్చింది.
- Yuzvendra Chahal Divorce: యుజ్వేంద్ర చహల్, ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్న విషయం తెలుసు కదా. ఈ విడాకులకు ఆర్జే మహావష్ తో చహల్ డేటింగే కారణమన్న పుకార్లు కూడా వచ్చాయి. దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ గట్టి వార్నింగ్ ఇచ్చింది.
(1 / 7)
Yuzvendra Chahal Divorce: క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ ఈ మధ్య క్రిస్మస్ పార్టీలో ఓ అమ్మాయితో కలిసి ఉన్న ఫొటో బయటకు రావడంతో ఆమెతో డేటింగ్ లో ఉన్నాడని, ధనశ్రీకి విడాకులు ఇవ్వబోతున్నాడన్న పుకార్లు వచ్చాయి. ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి పేరు ఆర్జే మహావష్. ఇప్పుడామె ఈ వార్తలపై స్పందించింది.
(2 / 7)
Yuzvendra Chahal Divorce: చహల్ తో డేటింగ్ రూమర్లపై ఆమె ఇన్‌స్టా ద్వారా స్పందించింది. “కొన్ని పుకార్లు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పుకార్లు మొత్తం నిరాధారమైనవే. ఓ అబ్బాయితో కలిసి కనిపిస్తే అతనితో డేటింగ్ చేసినట్లేనా? ఇంకా ఏ కాలంలో ఉన్నారు? అలా అయితే మీరు ఎంతమందితో డేటింగ్ చేస్తున్నారు? రెండు, మూడు రోజులుగా సహనంతో ఉన్నాను. కానీ అనవసరంగా నా పేరు లాగొద్దు. కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి” అని ఆమె పోస్ట్ చేసింది.
(3 / 7)
Yuzvendra Chahal Divorce: క్రిస్మస్ సందర్భంగా ఈ ఆర్జే మహావష్ పోస్ట్ చేసిన ఫొటోలతోనే ఇదంతా మొదలైంది. ఆ ఫొటోల్లో ఒకదాంట్లో చహల్ కూడా కనిపించడంతో వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, ధనశ్రీకి విడాకులు ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
(4 / 7)
Yuzvendra Chahal Divorce: డెంటిస్ట్ అయిన ధనశ్రీ వర్మను 2020లో చహల్ పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఓ డ్యాన్సర్ కూడా. ప్రముఖ రియాల్టీ షో ఝలక్ దిఖ్‌లాజా షోలోనూ పార్టిసిపేట్ చేసింది.
(5 / 7)
Yuzvendra Chahal Divorce: చహల్, ధనశ్రీ వర్మ నాలుగేళ్లు బాగానే కలిసి ఉన్నా.. ఇప్పుడు విడాకుల వార్తలు సంచలనం రేపుతున్నాయి. అయితే ఈ వార్తలపై వాళ్లు నేరుగా స్పందించకుండా పరోక్షంగా పోస్టులు చేస్తున్నారు.
(6 / 7)
Yuzvendra Chahal Divorce: ఈ వార్తలపై ధనశ్రీ స్పందించింది. "గత కొన్ని రోజులు నాకు, నా కుటుంబానికి చాలా కష్టంగా గడిచాయి. ఎలాంటి నిజనిర్ధారణ లేకుండా నిరాధారమైన రాతలు, విద్వేషాలు రెచ్చగొట్టే ట్రోల్స్ నా వ్యక్తిత్వ హననం చేస్తున్నాయి. నా మౌనం బలహీనతకు సంకేతం కాదు, బలానికి సంకేతం. ఆన్లైన్లో ప్రతికూలతను వ్యాప్తి చేయడం సులభం, ఇతరుల శ్రేయస్సు కోసం ఆలోచించడానికి ధైర్యం, సహానుభూతి అవసరం’ అని ధనశ్రీ పోస్ట్ చేసింది.
(7 / 7)
Yuzvendra Chahal Divorce: అటు చహల్ కూడా స్పందించాడు. 'నేను ఆటగాడిగా గర్వపడుతున్నాను, కానీ కొన్ని అంశాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చూశాను, ఇవన్నీ ఊహాగానాలు. అవి నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఇలాంటి ఊహాగానాలు నన్ను, నా కుటుంబాన్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, అలాంటి ఊహాగానాలకు పాల్పడవద్దని వినయంగా కోరుతున్నాను’ అని కోరాడు.
ఇతర గ్యాలరీలు