(1 / 5)
సీఎస్కేపై యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ సాధించాడు. 19వ ఓవర్లో వరుసగా చివరి మూడు బంతులకు వికెట్లు సాధించాడు. దీపక్ హుడా, అన్షుల్, నూర్ అహ్మద్ ను ఔట్ చేశాడు. ఐపీఎల్ 2025లో ఇదే ఫస్ట్ హ్యాట్రిక్.
(HT_PRINT)(2 / 5)
ఐపీఎల్ హిస్టరీలో చాహల్ కు ఇది రెండో హ్యాట్రిక్. 2022లోనే అతను హ్యాట్రిక్ సాధించాడు. ఈ లీగ్ చరిత్రలో ఒకటి కంటే ఎక్కువ సార్లు హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్ చాహల్. అమిత్ మిశ్రా (2008, 2011, 2013), యువరాజ్ సింగ్ (2009లోనే రెండు సార్లు) ముందున్నారు.
(AP)(3 / 5)
సీఎస్కేపై హ్యాట్రిక్ తో సహా అదే ఓవర్లో ఫస్ట్ ధోనీని ఔట్ చేసిన చాహల్.. నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ లో ఒకే ఓవర్లో నాలుగు వికెట్ల ఘనతను రెండు సార్లు అందుకున్న ఫస్ట్ బౌలర్ గా చాహల్ నిలిచాడు.
(AFP)(4 / 5)
2022లోనూ చాహల్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతూ కేకేఆర్ పై ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్ లో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టిన బౌలర్ల లిస్ట్ లో అమిత్ మిశ్రా (2013), రసెల్ (2022) కూడా ఉన్నారు.
(PTI)ఇతర గ్యాలరీలు