Yuvraj Singh: రోహిత్, కోహ్లీ ఫామ్‍పై స్పందించిన యువరాజ్ సింగ్.. అవి మరిచిపోవద్దంటూ..-yuvraj singh backs rohit sharma and virat kohli says people forget what they achieved ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Yuvraj Singh: రోహిత్, కోహ్లీ ఫామ్‍పై స్పందించిన యువరాజ్ సింగ్.. అవి మరిచిపోవద్దంటూ..

Yuvraj Singh: రోహిత్, కోహ్లీ ఫామ్‍పై స్పందించిన యువరాజ్ సింగ్.. అవి మరిచిపోవద్దంటూ..

Jan 07, 2025, 09:55 PM IST Chatakonda Krishna Prakash
Jan 07, 2025, 09:51 PM , IST

  • Yuvraj Singh: భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కొంతకాలంగా విఫలమవుతున్నారు. దీంతో వారిపై విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై టీమిండియా మాజీ దిగ్గజ ఆల్‍రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‍లో ఉన్నారు. వరుసగా విఫలమవుతున్నారు. స్వదేశంలో న్యూజిలాండ్‍తో టెస్టు సిరీస్‍లో.. ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఫెయిల్ అయ్యారు. ఈ రెండు సిరీస్‍ల్లో టీమిండియాకు పరాజం ఎదురైంది. దీంతో ఇక రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాలని కూడా డిమాండ్లు వస్తున్నాయి. విమర్శలు ఎక్కువవుతున్నాయి. 

(1 / 5)

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‍లో ఉన్నారు. వరుసగా విఫలమవుతున్నారు. స్వదేశంలో న్యూజిలాండ్‍తో టెస్టు సిరీస్‍లో.. ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఫెయిల్ అయ్యారు. ఈ రెండు సిరీస్‍ల్లో టీమిండియాకు పరాజం ఎదురైంది. దీంతో ఇక రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాలని కూడా డిమాండ్లు వస్తున్నాయి. విమర్శలు ఎక్కువవుతున్నాయి. (AP)

రోహిత్, కోహ్లీ ఫామ్, వారిపై వస్తున్న విమర్శల గురించి స్పందించాడు భారత మాజీ దిగ్గజ ఆల్‍రౌండర్ యువరాజ్ సింగ్. వారికి మద్దతుగా మాట్లాడాడు. విమర్శించడం సరికాదని చెప్పాడు. 

(2 / 5)

రోహిత్, కోహ్లీ ఫామ్, వారిపై వస్తున్న విమర్శల గురించి స్పందించాడు భారత మాజీ దిగ్గజ ఆల్‍రౌండర్ యువరాజ్ సింగ్. వారికి మద్దతుగా మాట్లాడాడు. విమర్శించడం సరికాదని చెప్పాడు. 

విరాట్, రోహిత్ గతంలో సాధించిన విజయాలను ఎవరూ మరిచిపోకూడదని యువరాజ్ చెప్పాడు. “మనం గ్రేట్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి మాట్లాడుతున్నాం. వారిని కొందరు విమర్శిస్తున్నారు. గతంలో వారు ఏం సాధించారో జనాలు మరిచిపోతున్నారు. ప్రస్తుత తరంలో వారు గొప్ప క్రికెటర్లలో ఉన్నారు. వాళ్ల ఓడారు. సరిగా ఆడలేదు. ఈ విషయంలో మనకంటే వారే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు” అని పీటీఐ ఇంటర్వ్యూలో యువరాజ్ అన్నాడు. విరాట్, రోహిత్ తనకు కుటుంబ సభ్యుల్లాంటి వారని, వాళ్లిద్దరూ మళ్లీ అదరగొడతారనే నమ్మకం ఉందని చెప్పాడు. 

(3 / 5)

విరాట్, రోహిత్ గతంలో సాధించిన విజయాలను ఎవరూ మరిచిపోకూడదని యువరాజ్ చెప్పాడు. “మనం గ్రేట్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి మాట్లాడుతున్నాం. వారిని కొందరు విమర్శిస్తున్నారు. గతంలో వారు ఏం సాధించారో జనాలు మరిచిపోతున్నారు. ప్రస్తుత తరంలో వారు గొప్ప క్రికెటర్లలో ఉన్నారు. వాళ్ల ఓడారు. సరిగా ఆడలేదు. ఈ విషయంలో మనకంటే వారే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు” అని పీటీఐ ఇంటర్వ్యూలో యువరాజ్ అన్నాడు. విరాట్, రోహిత్ తనకు కుటుంబ సభ్యుల్లాంటి వారని, వాళ్లిద్దరూ మళ్లీ అదరగొడతారనే నమ్మకం ఉందని చెప్పాడు. (AFP)

టీమిండియా మళ్లీ జోరు చూపిస్తుందని యువరాజ్ సింగ్ చెప్పాడు. రోహిత్‍తో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తనకు నమ్మకం ఉందని అన్నాడు. “కోచ్‍గా గౌతమ్ గంభీర్, సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‍ప్రీత్ బుమ్రా.. ప్రస్తుతం క్రికెట్‍లో చాలా బాగా ఆలోచించగలరని నేను అనుకుంటున్నా. భారత క్రికెట్ భవిష్యత్తు ఎలా ముందుకు సాగాలో వారు నిర్ణయించాల్సి ఉంది” అని యువరాజ్ చెప్పాడు. 

(4 / 5)

టీమిండియా మళ్లీ జోరు చూపిస్తుందని యువరాజ్ సింగ్ చెప్పాడు. రోహిత్‍తో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తనకు నమ్మకం ఉందని అన్నాడు. “కోచ్‍గా గౌతమ్ గంభీర్, సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‍ప్రీత్ బుమ్రా.. ప్రస్తుతం క్రికెట్‍లో చాలా బాగా ఆలోచించగలరని నేను అనుకుంటున్నా. భారత క్రికెట్ భవిష్యత్తు ఎలా ముందుకు సాగాలో వారు నిర్ణయించాల్సి ఉంది” అని యువరాజ్ చెప్పాడు. (ANI Pictures Wire)

రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ అని యువరాజ్ సింగ్ చెప్పాడు. “అతడు ఓ గ్రేట్ కెప్టెన్. గెలిచినా.. ఓడినా అతడు మాత్రం గొప్ప కెప్టెనే. అతడి కెప్టెన్సీలో మనం వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడాం. టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచాం. చాలా విజయాలు సాధించాం” అని యువరాజ్ గుర్తు చేశాడు. ఇప్పుడు విమర్శించే వారు టీమిండియా గణాంకాలను పరిశీలించాలని యువీ సలహా ఇచ్చాడు. 

(5 / 5)

రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ అని యువరాజ్ సింగ్ చెప్పాడు. “అతడు ఓ గ్రేట్ కెప్టెన్. గెలిచినా.. ఓడినా అతడు మాత్రం గొప్ప కెప్టెనే. అతడి కెప్టెన్సీలో మనం వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడాం. టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచాం. చాలా విజయాలు సాధించాం” అని యువరాజ్ గుర్తు చేశాడు. ఇప్పుడు విమర్శించే వారు టీమిండియా గణాంకాలను పరిశీలించాలని యువీ సలహా ఇచ్చాడు. (AFP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు