YS Jagan Selfie : సెల్ఫీ కోసం బోరున ఏడ్చేసిన చిన్నారి, కారు ఆపి చిన్నారి కోరిక తీర్చిన వైఎస్ జగన్
YS Jagan Selfie : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయవాడ పర్యటనలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అన్న ప్లీజ్ అంటూ సెల్ఫీ కోసం ఓ చిన్నారి కేకలు వేయడం, కారు ఆపి చిన్నారికి జగన్ సెల్ఫీ ఇవ్వడం సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది.
(1 / 6)
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయవాడ పర్యటనలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అన్న ప్లీజ్ అంటూ సెల్ఫీ కోసం ఓ చిన్నారి కేకలు వేయడం, కారు ఆపి చిన్నారికి జగన్ సెల్ఫీ ఇవ్వడం సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది.
(2 / 6)
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించి గాంధీనగర్ జిల్లా జైలు నుంచి తిరిగి తాడేపల్లి బయలుదేరుతున్న సమయంలో ఒక అభిమాని తన కుమార్తెను తీసుకుని వైఎస్ జగన్ ను కలిసేందుకు వచ్చారు.
(3 / 6)
జిల్లా జైలు వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు ఉండడంతో ఆ రద్దీలో వైఎస్ జగన్ ను కలవలేననుకున్న చిన్నారి ఒక్కసారిగా ఏడ్చింది. దీనిని గమనించిన వైఎస్ జగన్ తన కాన్వాయ్ ఆపి ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని ముద్దాడారు.
(4 / 6)
బాలికతో సీఎం జగన్ సెల్ఫీ దిగారు. దీంతో ఆ చిన్నారి ఆనందానికి హద్దుల్లేవు. తిరిగి వైఎస్ జగన్ ను ముద్దాడి సంతోషంగా ఇంటికి వెళ్లింది.
(5 / 6)
సంతోషంతో ఉప్పొంగిపోయిన పాప ఏడుస్తూనే జగన్ ప్రయాణిస్తున్న కారు నుంచి దిగింది. వైఎస్ జగన్ చేసిన ఈ పనిని చూసి అక్కడున్న అభిమానుల్లో ఉత్సాహంగా నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇతర గ్యాలరీలు