మాఘ పూర్ణిమ నాడు ఇలా చేస్తే మీ ప్రయత్నాలు సఫలం
- Magha purnima: హిందూ మతంలో మాఘ పూర్ణిమకు ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రత్యేక రోజున స్నానం, విష్ణుకు ప్రత్యేక పూజలు, దానం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి.
- Magha purnima: హిందూ మతంలో మాఘ పూర్ణిమకు ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రత్యేక రోజున స్నానం, విష్ణుకు ప్రత్యేక పూజలు, దానం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి.
(1 / 13)
ఏటా 12 పౌర్ణమి ఉపవాసాలు ఆచరిస్తారు. వీటిలో మాఘమాసం పౌర్ణమి తిథికి విశేష ప్రాధాన్యత ఉంది. మాఘమాసంలో వచ్చే ఈ తిథిని మాఘ పూర్ణిమ లేదా మాఘ పౌర్ణమి అని అంటారు. ఈ రోజున తలస్నానం, దానం, పూజ చేస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఉపవాసం ఫిబ్రవరి 5, 2023 ఆదివారం నాడు ఆచరిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున శ్రీమహావిష్ణువు, చంద్రుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మాఘ పూర్ణిమ రోజున ఆచరించే కర్మలు పుణ్యాన్ని ఇస్తాయి. వివిధ రాశులు వారి రాశికి అనుగుణంగా ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
(2 / 13)
మేషం: మేష రాశి వారు మాఘ పూర్ణిమ రోజున శివునితో పాటు విష్ణువును పూజించి, పప్పు నైవేద్యంగా సమర్పించాలి. దీని ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి.
(3 / 13)
వృషభం: వృషభ రాశి వారు మాఘ పూర్ణిమ రోజున అశ్వథ్ వృక్షానికి తీపి పాలను సమర్పించాలి. అలాగే ఈ రోజున చెట్టు కింద ఐదు ఆవాల నూనె దీపాలు వెలిగించండి. ఇది సంపదను తెస్తుంది.
(5 / 13)
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే మాఘ పూర్ణిమ రోజున పచ్చి పాలతో తేనె కలిపి శివునికి అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల కర్కాటక రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది.
(6 / 13)
సింహరాశి: సింహరాశిలో జన్మించినవారు మాఘ మాసం పౌర్ణమి తిథి నాడు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత నీటిలో గులాబీ పూలతో సూర్యదేవునికి నైవేద్యాలు సమర్పించాలి. అన్నదానం చేయడం మంచిది.
(7 / 13)
కన్య: కన్యా రాశి వారు మాఘ పూర్ణిమ రోజున 7 మంది ఆడపిల్లలకు ఖీర్ ప్రసాదం పంచిపెడితే ఆర్థిక సమస్యలు తొలగుతాయి.
(8 / 13)
తుల: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మాఘ పూర్ణిమ రోజున తులారాశి వారు బ్రాహ్మణులకు లేదా పేదవారికి అన్నం, నెయ్యి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల అన్ని సమస్యలు నయమవుతాయని నమ్ముతారు.
(9 / 13)
వృశ్చికం: వృశ్చిక రాశి వారు మాఘ పూర్ణిమ రోజున హనుమాన్ ఆలయంలో పప్పు, బెల్లం, ఎర్రచందనం దానం చేయాలి. వీటిని దానం చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.
(10 / 13)
ధనుస్సు: మాఘ పూర్ణిమ రోజున శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా పూజిస్తారని మనకు తెలుసు, ధనుస్సు రాశి వారు ఈ రోజున విష్ణువుకు పసుపు పువ్వులు, పసుపు రంగు మిఠాయిలను సమర్పించాలి.
(11 / 13)
మకరం: మకర రాశి వారు మాఘ పూర్ణిమ రోజున పేదవారికి అన్నదానం చేయాలి. అంతే కాకుండా ఆవాలు లేదా నువ్వులను దానం చేయడం వల్ల కూడా విశేష ప్రయోజనాలు లభిస్తాయి. ఇలా చేయడం వల్ల అనేక రకాల దోషాలు తొలగిపోతాయని నమ్మకం.
(12 / 13)
కుంభం: మాఘ పూర్ణిమ రోజున కుంభ రాశి వారు హనుమాన్ ఆలయానికి ఎర్రటి వస్త్రంతో తయారు చేసిన త్రిభుజాకార జెండాను గుడి వద్ద కట్టండి. ఇలా చేయడం వల్ల అన్ని పనులు విజయవంతం అవుతాయి. సమస్యలు తొలగిపోతాయి.
ఇతర గ్యాలరీలు