మృణాల్ ఠాకూర్ వేసుకున్న గ్లామరస్ బ్లాక్ ఎంబ్రాయిడరీ బ్లేజర్ ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు
మృణాల్ ఠాకూర్ తన అందంతో చూపు తిప్పుకోనివ్వదు. ఆమె ఫోటోలు ఎప్పటికప్పుడు ట్రెండవుతూనే ఉంటాయి. ఇప్పుడు బ్లాక్ డ్రెస్ లో ఆమె ఫోటోలు చూసి అభిమానులు వారెవ్వా అంటున్నారు. ఆమె వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎంతో తెలిస్తే మీరు కూడా వామ్మో అంటారు.
(1 / 7)
ఇప్పుడు హాట్ ఫేవరేట్ హీరోయిన్ గా మారింది మృణాల్ ఠాకూర్. ఆమె చేసిన సినిమాలకు అభిమానులు ఎక్కువ. సోషల్ మీడియాలో కూడా మృణాల్ ఠాకూర్ యాక్టివ్ గానే ఉంటుంది.
(Instagram/@mrunalthakur)(2 / 7)
మృణాల్ ఠాకూర్ ఏ డ్రెస్ వేసినా చక్కగా నప్పేస్తుంది. చీరలో సాంప్రదాయంగా కనిపించే మృణాల్, వెస్ట్రన్ వేర్‌లో చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంటుంది.
(Instagram/@mrunalthakur)(3 / 7)
మృణాల్ ఠాకూర్ ఈ ఫోటోల్లో వేసుకున్న డ్రెస్సును చూశారా? చాలా బావుంది కదా, దీని రేటు తెలిస్తే మాత్రం అవాక్కవుతారు. ఈ నల్ల డ్రెస్ అంత ఖరీదా అనుకుంటారు. మరి ధరెంతో చెప్పేయమంటారా?
(Instagram/@mrunalthakur)(4 / 7)
మృణాల్ వేసుకున్న ఈ డ్రెస్ ధర 88,000 రూపాయలు. బ్లాక్ పలాజో డ్రెస్ కాలేజీ అమ్మాయిలకు తెగ నచ్చేయడం ఖాయం.
(Instagram/@mrunalthakur)(5 / 7)
ఈ డ్రెస్ జార్టెట్ ఫ్యాబ్రిక్ కుట్టారు. సీక్విన్ ఎంబ్రాయిడరీని చేశారు. క్రాప్ టాప్ తో ఈ డ్రెస్ చాలా ట్రెండీగా ఉంది. శాటిన్ లైనింగ్ తో ఉండే హాఫ్ స్లీవ్ బ్లేజర్ చూపు తిప్పుకోనివ్వడం లేదు.
(Instagram/@mrunalthakur)(6 / 7)
మృణాల్ ఠాకూర్ తెలుగు, తమిళంలో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఈమె 2014లో మరాఠీ సినిమాతో తెరంగేట్రం చేసింది.
(Instagram/@mrunalthakur)ఇతర గ్యాలరీలు