తెలుగు న్యూస్ / ఫోటో /
Brain Foods for Kids: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలివే..
Brain Foods for Kids: మెదడు అభివృద్ధిలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బాల్యంలో సరిగ్గా తినకపోవడం వల్ల జ్ఞాపకశక్తిమీదా, ఆలోచనా శక్తి మీద ప్రభావం ఉంటుంది.
(1 / 6)
మెదడు పెరుగుదల, పనితీరుతో సహా ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాల్లో సరైన పోషకాహారం ముఖ్యం. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలేంటో తెలుసుకుందాం. (Freepik)
(2 / 6)
పెరుగులో మెదడు ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలుంటాయి. దీంట్లో అయోడిన్ ఉంటుంది. పెరుగు మెదడు పనితీరుకు ముఖ్యమైన ప్రోటీన్, జింక్, విటమిన్ B12 మరియు సెలీనియం వంటి అనేక ఇతర పోషకాలు దీంట్లో ఉంటాయి. (Pexels)
(3 / 6)
పాలకూర వంటి ఆకుకూరలు మెదడును రక్షించే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. వీటిలో ఫోలేట్, ఫ్లవనాయిడ్లు, కెరోటినాయిడ్లు, విటమిన్ ఇ, కె ఉంటాయి. కెరోటినాయిడ్ ఎక్కువగా ఉండే ఆహారం మెదడు అభిజ్ఞా శక్తి పెంచుతుంది. (Freepik)
(4 / 6)
చిక్కుళ్లు, బీన్స్ లో మెగ్నీషియం, జింక్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్ వంటి మెదడుకు అనుకూలమైన పోషకాలుంటాయి. ఇవన్నీ మానసిక స్థితి మరియు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. (Pixabay)
(5 / 6)
గోధుమలు, బార్లీ, బియ్యం, ఓట్స్ వంటి తృణధాన్యాల్లో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు పనితీరును మరియు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. (Pixabay)
ఇతర గ్యాలరీలు