Telangana Tourism: వీకెండ్‌లో పిక్‌నిక్ ప్లాన్ ఉందా..? మాదన్నపేట చెరువు బెస్ట్ ప్లేస్-you can enjoy with kids at madannapet lake ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Tourism: వీకెండ్‌లో పిక్‌నిక్ ప్లాన్ ఉందా..? మాదన్నపేట చెరువు బెస్ట్ ప్లేస్

Telangana Tourism: వీకెండ్‌లో పిక్‌నిక్ ప్లాన్ ఉందా..? మాదన్నపేట చెరువు బెస్ట్ ప్లేస్

Updated Aug 30, 2024 02:50 PM IST Basani Shiva Kumar
Updated Aug 30, 2024 02:50 PM IST

  • Telangana Tourism: ఓవైపు అందమైన చెరువు. మరోవైపు పచ్చని పంట పొలాలు. ఇంకోవైపు ప్రశాంతమైన వాతావరణంలో శివాలయం. ఇవన్నీ ఒకే చోట ఉన్నాయి. అదే మాధన్నపేట చెరువు. నర్సంపేట పట్టణం సమీపంలో ఉన్న ఈ చెరువు వద్దకు వెళ్తే.. చిన్నారు ఎంజాయ్ చేస్తారు.. పెద్దలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారు.

మాధన్నపేట చెరువు వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో ఉంది. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రస్తుతం చెరువు నిండు కుండలా ఉంది. దీంతో ఇక్కడ ఎంజాయ్ చేయడానికి నర్సంపేట, వరంగల్, హనుమకొండ నుంచి పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా చిన్నారులు ఇక్కడ ఎంజాయ్ చేస్తారు.

(1 / 5)

(HT Telugu)

చెరువులో ఇంతకు ముందు బోటింగ్ ఉండేది. కానీ.. ఇటీవల కురిసన భారీ వర్షాలకు చెరువు నిండి మత్తడి పోయడంతో.. వాటిని పక్కనబెట్టారు. మళ్లీ కొన్ని రోజుల తర్వాత బోటింగ్‌ను స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ చెరువు విస్తీర్ణం దాదాపు 2300 ఎకరాల్లో ఉంటుంది. బోటింగ్ ఉంటే 15 నిమిషాల్లో ఈ చెరువును చుట్టేయొచ్చు.

(2 / 5)

మాధన్నపేట చెరువు కింద సుమారు 8 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతో చెరువు కట్టపై చూస్తే.. కనుచూపు మేర నేలంతా పచ్చదనం పరుచుకొని ఉంటుంది. వాతావరణం హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే.. వీకెండ్స్ చాలా మంది పిల్లలను తీసుకొని ఇక్కడికి పిక్‌నిక్‌కు వస్తారు.

(3 / 5)

మాధన్నపేట చెరువు కట్టపై శివాలయం ఉంది. పండగల సందర్భంగా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఇక్కడి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. చెరువులో స్నానం చేసి.. శివాలయంలో పూజలు చేస్తారు. ప్రతిరోజు ఉదయం ఆలయం తెరుస్తారు. రాత్రి వరకు ఉంటారు. దీంతో పిల్లలకు ఆనందం.. పెద్దలకు ఆధ్యాత్మికం లభిస్తాయి.

(4 / 5)

వరంగల్ నగరానికి మాధన్నపేట చెరువు 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వరంగల్ వరకు ట్రైన్‌లో వస్తే.. అక్కడి నుంచి నర్సంపేటకు బస్సులో రావొచ్చు. నర్సంపేట నుంచి మాధన్నపేట చెరువుకు ప్రైవేటు వాహనాల్లో రావొచ్చు. సొంత వానం ఉంటే వరంగల్ నుంచి నర్సంపేట మీదుగా మాధన్నపేట చెరువుకు చేరుకోవచ్చు. 

(5 / 5)

ఇతర గ్యాలరీలు