తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather Updates : పెరుగుతున్న చలి తీవ్రత - తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు..! ఏపీలో పొడి వాతావరణం
- AP Telangana Cold Wave Updates: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో జనాలు వణికిపోతున్నారు. తెలంగాణలో రెండురోజులపాటు శీతల గాలులు వీస్తాయని హెదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 7)
తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. శీతల గాలులతో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి. ఇక ఉదయం సమయంలో చాలా చోట్ల పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటోంది.
(2 / 7)
తెలంగాణలో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.(Keshav Singh/Hindustan Times)
(3 / 7)
ఇవాళ(3 జనవరి 2025) తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో అక్కడకక్కడ శీతల గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
(4 / 7)
రేపు(4 జనవరి 2025) తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ చేసింది.
(5 / 7)
జనవరి 5వ తేదీ నుంచి తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది.
(6 / 7)
ఆంధ్రప్రదే, యనాంలోని దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. కొన్నిచోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. (HT Photo/Sakib Ali)
ఇతర గ్యాలరీలు