(1 / 7)
తెలంగాణలో సూర్యుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 9 దాటితే చాలు… ఎండ తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లలేకపోతున్నారు.
(Photo Source @APSDMA Twitter)(2 / 7)
ఈ ఏడాది ఫిబ్రవరి ఆరంభం నుంచే ఎండలు పెరిగాయి, వేసవి ఆరంభంలోనే ఈస్థాయి ఎండలు ఉండటంతో… జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో అధికస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
(Photo Source @APSDMA Twitter)(3 / 7)
తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది. రేపు(మార్చి 15) పలు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
(PTI)(4 / 7)
శనివారం(మార్చి 15) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
(5 / 7)
తెలంగాణలోని ఆదిలాబాద్‌లో గురువారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. సాధారణం కన్నా ఏకంగా 4.4 డిగ్రీలు పెరిగి.. 40.3 డిగ్రీలుగా నమోదయింది. బుధవారం రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రత కూడా సాధారణం కన్నా 2 డిగ్రీలు పెరిగి 22.7 డిగ్రీలుగా నమోదయ్యాయి. నిజామాబాద్‌లో పగటిపూట సాధారణం కన్నా 3.2 డిగ్రీలు పెరిగి 40.1 డిగ్రీలు రికార్డు అయింది. ఈ నేపథ్యంలో… శని, ఆదివారాల్లో రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.
(6 / 7)
ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు పాత రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మార్చి 15 నుంచి ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరుగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు.
(Image Source Pixabay )ఇతర గ్యాలరీలు