Year Ender 2023: 2023 లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులు..-year ender 2023 most important supreme court judgements of the year ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Year Ender 2023: 2023 లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులు..

Year Ender 2023: 2023 లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులు..

Published Dec 30, 2023 06:03 PM IST HT Telugu Desk
Published Dec 30, 2023 06:03 PM IST

2023 Supreme Court judgements: 2023 సంవత్సరంలో సుప్రీంకోర్టు పలు కీలక, సంచలన, చరిత్రాత్మక తీర్పులను వెలువరించింది. స్వలింగ వివాహాలు, జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి వంటి అంశాలు వాటిలో ఉన్నాయి.

2016 లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ధృవీకరించడంతో 2023 ప్రారంభమైంది. అలాగే, జమ్మూ, కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019 లో తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ మరో ముఖ్యమైన తీర్పుతో ముగిసింది. 

(1 / 7)

(HT File Photo)

2016 నవంబర్ లో రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 4:1 మెజారిటీతో సమర్ధిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2023 జనవరిలో తీర్పును వెలువరించింది,

(2 / 7)

సంప్రదాయ క్రీడలు జల్లికట్టు, కంబాలలకు అనుమతిస్తూ 2023 మే 18 న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకుతమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక అసెంబ్లీలు జంతువులపై క్రూరత్వ నిరోధక (PCA) చట్టం, 1960కి చేసిన సవరణలను సుప్రీం కోర్టు సమర్థించింది.

(3 / 7)

(PTI)

క్రిమినల్ పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు 2023 ఆగస్ట్ 4వ తేదీన స్టే విధించింది. 2019లో కర్నాటక లో ఒక బహిరంగ సభలో 'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ లో పరువు నష్టం కేసు నమోదైంది.

(4 / 7)

(File Photo)

మురుగు కాల్వలను శుభ్రం చేస్తున్నప్పుడు మరణించిన వ్యక్తుల కుటుంబీకులకు ప్రభుత్వం రూ. 30 లక్షలు పరిహారంగా చెల్లించాలని సుప్రీంకోర్టు అక్టోబర్ 20న తీర్పునిచ్చింది. అదనంగా, ఈ విధుల్లో భాగంగా ప్రమాదాలకు గురై, శాశ్వత వైకల్యం పొందినవారికి కనీసం రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. మాన్యువల్ స్కావెంజింగ్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఉద్ఘాటించింది.

(5 / 7)

జమ్మూకశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా సమర్థించింది. ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధన మాత్రమేనని బెంచ్ నొక్కి చెప్పింది. ఈ మేరకు డిసెంబర్ 11న తీర్పు వెలువరించింది.

(6 / 7)

(AFP)

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడానికి నిరాకరిస్తూ సుప్రీంకోర్టు అక్టోబర్ 17న తీర్పు వెలువరించింది. ఈ విషయంలో తుది నిర్ణయం పార్లమెంటుదేనని స్పష్టం చేసింది. ఎల్జీబీటీక్యూ ప్లస్ కమ్యూనిటీ హక్కులను కాపాడాలని, వారిపై వివక్షను అంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు