(1 / 5)
Yashasvi Jaiswal Records: ఒక టెస్ట్ సిరీస్ ఐదు టెస్టుల్లోనూ హాఫ్ సెంచరీలు చేసిన అరుదైన రికార్డును యశస్వి జైస్వాల్ అందుకున్నాడు. 76 ఏళ్ల కిందట తొలిసారి ఈ రికార్డు నమోదవగా.. ఇప్పుడు యశస్వి మరోసారి అందుకున్నాడు.

(2 / 5)
Yashasvi Jaiswal Records: ఇంగ్లండ్ తో సిరీస్ తొలి టెస్టుల్లో యశస్వి 80, 15 స్కోర్లు చేశాడు. ఇక రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 209, రెండో ఇన్నింగ్స్ లో 17.. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 10, రెండో ఇన్నింగ్స్ లో 214.. నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 73, రెండో ఇన్నింగ్స్ లో 37 రన్స్ చేశాడు. ఇప్పుడు ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 58 బంతుల్లోనే 57 రన్స్ చేశాడు. మొత్తంగా ఈ సిరీస్ లో ఇప్పటి వరకూ 712 రన్స్ చేయడం విశేషం. ఒక సిరీస్ లో 700కుపైగా రన్స్ చేసిన రెండో ఇండియన్ ప్లేయర్స్ యశస్వి. గతంలో సునీల్ గవాస్కర్ ఈ ఘనత సాధించాడు.

(3 / 5)
Yashasvi Jaiswal Records: యశస్వి టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మైలురాయి అందుకున్న ఇండియన్ బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. తన 9వ టెస్ట్ ఆడుతున్న అతడు.. 16 ఇన్నింగ్స్ లో 1028 రన్స్ చేశాడు. అతని సగటు 68.53 కాగా.. స్ట్రైక్ రేట్ 70.07. అదులో నాలుగు హాఫ్ సెంచరీలు, మూడు సెంచరీలు ఉన్నాయి. రెండు డబుల్ సెంచరీలు కూడా చేశాడు. 108 ఫోర్లు బాదాడు.

(4 / 5)
Yashasvi Jaiswal Records: బజ్‌బాల్ అంటూ ఇండియాలో అడుగుపెట్టిన ఇంగ్లండ్ కు యశస్వి అసలు ఆ స్టైల్లో ఎలా ఆడాలో నేర్పిస్తున్నాడు. జైస్‌బాల్ అంటూ ఫ్యాన్స్ దానికో పేరు పెట్టారు.

(5 / 5)
Yashasvi Jaiswal Records: యశస్వి జైస్వాల్ మరోసారి రోహిత్ తో కలిసి తొలి వికెట్ కు సెంచరీకిపైగా భాగస్వామ్యం నమోదు చేశాడు. దీంతో ఇండియా తొలి రోజే వికెట్ నష్టానికి 135 రన్స్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ కంటే 83 పరుగులు వెనుకబడింది.
ఇతర గ్యాలరీలు