Yashasvi Jaiswal: బ్రాడ్‌మన్ తర్వాత యశస్విదే ఈ రికార్డు.. సచిన్, కోహ్లిలకూ సాధ్యం కాని రికార్డు ఇది
- Yashasvi Jaiswal: టెస్ట్ క్రికెట్‌లోకి వచ్చీరాగానే పరుగుల వరద పారిస్తున్నాడు యశస్వి జైస్వాల్. ఈ క్రమంలో అతడు బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. సచిన్, కోహ్లిలాంటి బ్యాటర్లకు కూడా సాధ్యం కాని రికార్డు అది.
- Yashasvi Jaiswal: టెస్ట్ క్రికెట్‌లోకి వచ్చీరాగానే పరుగుల వరద పారిస్తున్నాడు యశస్వి జైస్వాల్. ఈ క్రమంలో అతడు బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. సచిన్, కోహ్లిలాంటి బ్యాటర్లకు కూడా సాధ్యం కాని రికార్డు అది.
(1 / 7)
Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్టులో అరుదైన మైలురాళ్లు అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు బ్రాడ్‌మన్ విరాట్ కోహ్లిలాంటి గొప్ప క్రికెటర్ల సరసన నిలిచాడు.
(AFP)(2 / 7)
Yashasvi Jaiswal: ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్టు యశస్వి కెరీర్లో 8వ మ్యాచ్. ఈ 8 టెస్టుల్లోనే అతడు ఏకంగా 971 రన్స్ చేయడం విశేషం. అందులో రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
(REUTERS)(3 / 7)
Yashasvi Jaiswal: యశస్వి కంటే ముందు బ్రాడ్‌మన్ మాత్రమే తన తొలి 8 టెస్టుల్లో 1210 రన్స్ చేసి టాప్ లో ఉన్నాడు. యశస్వి తన 15 టెస్ట్ ఇన్నింగ్స్ లో ఏకంగా 69.35 సగటుతో రన్స్ చేశాడు. అందులో మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
(ANI )(4 / 7)
Yashasvi Jaiswal: ఇంగ్లండ్ తో నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 37 రన్స్ చేసిన యశస్వి.. కోహ్లి రికార్డును కూడా సమం చేశాడు. ఇంగ్లండ్ పై ఒక టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లి (655) సరసన యశస్వి నిలిచాడు. ఐదో టెస్టులో ఈ రికార్డును బ్రేక్ చేయడంతోపాటు గవాస్కర్ తర్వాత ఒక సిరీస్ లో 700కుపైగా రన్స్ చేసిన బ్యాటర్ గా నిలిచిన రెండో ఇండియన్ గా నిలిచే రికార్డుపై కన్నేశాడు.
(AFP)(5 / 7)
Yashasvi Jaiswal: ఇంగ్లండ్ తో నాలుగు టెస్టుల్లో యశస్వి రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో 655 రన్స్ చేశాడు. ఈ సిరీస్ లో అతడు వరుసగా 80, 15, 209, 17, 10, 214, 73, 37 రన్స్ చేశాడు.
(REUTERS)(6 / 7)
Yashasvi Jaiswal: ఇండియా తరఫున ఇప్పటికే వరుసగా రెండు టెస్టుల్లో డబుల్ సెంచరీలు చేసిన ప్లేయర్ గా వినోద్ కాంబ్లి, విరాట్ కోహ్లిలాంటి ప్లేయర్స్ సరసన నిలిచిన యశస్వి.. తాజాగా బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో నిలవడం విశేషం.
(AP)ఇతర గ్యాలరీలు