(1 / 5)
Xiaomi 13 Series – షావోమీ 13 సిరీస్ డిసెంబర్ 1వ తేదీన చైనాలో లాంచ్ కానుంది. షావోమీ 13, షావోమీ 13 ప్రో రానున్నాయి. షావోమీ బాస్ లీ జున్ ఈ ఫోన్‍లకు సంబంధించిన కొన్ని వివరాలను వెల్లడించారు. ఈ మొబైళ్లు స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ను కలిగి ఉంటాయి. షావోమీ 13 ఫ్లాట్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. బెజిల్స్ చాలా తక్కువగా ఉంటాయి. వాటర్, డస్ట్ రెసిస్టెంట్ కోసం ఐపీ68 రేటింగ్‍ను ఈ షావోమీ 13 సిరీస్ ఫోన్లు కలిగి ఉంటాయి.
(2 / 5)
120Hz రిఫ్రెష్ రేట్ ఉండే 6.2 ఇంచుల 2కే అమోలెడ్ డిస్‍ప్లేను షావోమీ 13 కలిగి ఉంటుందని తెలుస్తోంది. సోనీ ఐఎంఎక్స్ 8 సిరీస్‍కు చెందిన 50 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న మూడు కెమెరాలు ఈ సిరీస్ ఫోన్‍ల వెనుక ఉంటాయని సమాచారం. గరిష్టంగా 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ఉంటుందని తెలుస్తోంది.
(Xiaomi)(3 / 5)
Infinix Hot 20 5G - ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ ఫోన్ డిసెంబర్ 1న ఇండియాలో లాంచ్ కానుంది. జీఎస్ఎం ఎరీనా ప్రకారం, 6.6 ఇంచుల డిస్‍ప్లేతో ఈ స్మార్ట్ ఫోన్ రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‍తో ఈ 5జీ ఫోన్ రానుంది. ధర రూ.12,000 రేంజ్‍లో ఉంటుందని అంచనా.
(Infinix)(4 / 5)
iQOO 11 5G - ఐకూ కూడా రెండు కొత్త ఫోన్‍లను లాంచ్ చేసేందుకు రెడీ అయింది. ఐకూ 11 5జీ ఫోన్ డిసెంబర్ 2న చైనా, మలేషియాలో లాంచ్ కానుంది. 144హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే 6.78 ఇంచుల ఫుల్ హెచ్‍డీ డిస్‍ప్లేతో ఈ ఫోన్ వస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 8 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉంటాయని సమాచారం. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్ కలిగి ఉంటుందని లీక్‍ల ద్వారా వెల్లడైంది.
(iQOO)(5 / 5)
iQOO Neo 7 SE - ఐకూ నియో 7ఎస్ఈ మొబైల్ కూడా డిసెంబర్ 2వ తేదీన చైనాలో లాంచ్ కానుంది. 6.78 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లేతో ఈ మొబైల్ రానుంది. 120హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక 64 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ మాక్రో, 2 మెగాపిక్సెల్ ప్రోట్రయిట్ కెమెరాలు ఉంటాయని సమాచారం. మీడియాటెక్ డైమన్సిటీ 8200 ప్రాసెసర్ ఈ ఫోన్‍లో ఉంటుంది.
(iQOO)ఇతర గ్యాలరీలు