WTC Points Table: పాకిస్థాన్ మరింత పతనం.. ఇంగ్లండ్ చేతుల్లో ఓటమితో డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో అట్టడుగుకు..
- WTC Points Table: ఇంగ్లండ్ చేతుల్లో ఇన్నింగ్స్ తేడాతో దారుణ ఓటమి పాలైన పాకిస్థాన్.. డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో అట్టడుగు స్థానానికి పడిపోయింది. మరోవైపు టీమిండియా మాత్రం టాప్ లో కొనసాగుతోంది.
- WTC Points Table: ఇంగ్లండ్ చేతుల్లో ఇన్నింగ్స్ తేడాతో దారుణ ఓటమి పాలైన పాకిస్థాన్.. డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో అట్టడుగు స్థానానికి పడిపోయింది. మరోవైపు టీమిండియా మాత్రం టాప్ లో కొనసాగుతోంది.
(1 / 6)
WTC Points Table: పాకిస్థాన్ కు స్వదేశంలో మరో చేదు అనుభవం ఎదురైంది. ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టులో ఆ టీమ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో 500కుపైగా రన్స్ చేసినా ఇన్నింగ్స్ ఓటమి చెందిన తొలి జట్టుగా ఓ అపవాదును కూడా మూటగట్టుకుంది.
(REUTERS)(2 / 6)
WTC Points Table: ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల టేబుల్లో పాకిస్థాన్ అట్టడుగు స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఆ టీమ్ ఈ సైకిల్లో 8 టెస్టులు ఆడి కేవలం రెండింట్లో గెలిచి, ఆరు ఓడిపోయింది. 16 పాయింట్లు, 16.67 పర్సెంటేజీ పాయింట్లతో 9వ స్థానంలో నిలిచింది.
(REUTERS)(3 / 6)
WTC Points Table: ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 556 పరుగులు చేసింది. అయితే ఇంగ్లండ్ మరింత దీటుగా బదులిచ్చి 823 రన్స్ చేసి 267 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ లో పాక్ 220 పరుగులకే కుప్పకూలి ఇన్నింగ్స్ 47 పరుగులతో ఓడింది.
(AP)(4 / 6)
WTC Points Table: స్వదేశంలో పాకిస్థాన్ కు ఇది మరో దారుణమైన అనుభవం అని చెప్పొచ్చు. ఊహించని రీతిలో ఎదురైన ఈ ఓటమితో ఆ టీమ్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది.
(REUTERS)(5 / 6)
WTC Points Table: ఈ విజయంతో ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఆ టీమ్ ఈ సైకిల్లో 17 టెస్టులు ఆడి 9 గెలిచి, ఏడు ఓడింది. మరో టెస్టు డ్రా అయింది. 93 పాయింట్లు, 45.59 పర్సెంటేజీ పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.
(AFP)ఇతర గ్యాలరీలు