WTC Final India Scenario: ఇండియాకు ఇంకా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవమే! ఏం చేయాలంటే..-wtc final india scenario rohit sharma team can qualify world test championship final if this happens ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Wtc Final India Scenario: ఇండియాకు ఇంకా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవమే! ఏం చేయాలంటే..

WTC Final India Scenario: ఇండియాకు ఇంకా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవమే! ఏం చేయాలంటే..

Dec 30, 2024, 02:40 PM IST Chatakonda Krishna Prakash
Dec 30, 2024, 02:35 PM , IST

  • WTC 2023-25 Final India Scenario: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారత్ ఓటమి పాలైంది. అయినా ఇంకా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఫైనల్ చేరాలంటే ఏం జరగాలంటే..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఐదు టెస్టుల సిరీస్‍లో నాలుగో మ్యాచ్‍లో నేడు (డిసెంబర్ 30) టీమిండియా 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో 1-2తో సిరీస్‍లో వెనుకబడింది. 

(1 / 6)

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఐదు టెస్టుల సిరీస్‍లో నాలుగో మ్యాచ్‍లో నేడు (డిసెంబర్ 30) టీమిండియా 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో 1-2తో సిరీస్‍లో వెనుకబడింది. (BCCI- X)

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు సిడ్నీ వేదికగా జనవరి 3న షురూ కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‍లో టీమిండియాకు ఇదే చివరి మ్యాచ్. అయితే, ఆస్ట్రేలియా.. శ్రీలంకతో ఆ దేశంలో మరో రెండు టెస్టులు ఆడనుంది. ఆసీస్‍తో నాలుగో టెస్టు ఓడినా భారత్‍కు ఇంకా డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ ఆశలు సజీవంగా ఉన్నాయి. 

(2 / 6)

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు సిడ్నీ వేదికగా జనవరి 3న షురూ కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‍లో టీమిండియాకు ఇదే చివరి మ్యాచ్. అయితే, ఆస్ట్రేలియా.. శ్రీలంకతో ఆ దేశంలో మరో రెండు టెస్టులు ఆడనుంది. ఆసీస్‍తో నాలుగో టెస్టు ఓడినా భారత్‍కు ఇంకా డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ ఆశలు సజీవంగా ఉన్నాయి. (AP)

డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగే ఐదో టెస్టులో భారత్ తప్పకుండా గెలువాలి. అలా అయితేనే ఆశలు నిలుస్తాయి. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయినా.. ఆసీస్ గెలిచినా ఫైనల్ రేసు నుంచి టీమిండియా ఔట్ అవుతుంది. ఆస్ట్రేలియా ఫైనల్ చేరుతుంది. 

(3 / 6)

డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగే ఐదో టెస్టులో భారత్ తప్పకుండా గెలువాలి. అలా అయితేనే ఆశలు నిలుస్తాయి. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయినా.. ఆసీస్ గెలిచినా ఫైనల్ రేసు నుంచి టీమిండియా ఔట్ అవుతుంది. ఆస్ట్రేలియా ఫైనల్ చేరుతుంది. (AFP)

ఐదో టెస్టు గెలిచినా.. శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‍పై భారత డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. భారత్ సిడ్నీ టెస్టులో విజయం సాధించి.. ఆస్ట్రేలియాపై శ్రీలంక 1-0 లేదా 2-0తో గెలువాలి. ఇలా అయితేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది. సిడ్నీ టెస్టులో ఓడినా.. లంకతో టెస్టు సిరీస్‍లో ఓ మ్యాచ్ గెలిచినా.. రెండు మ్యాచ్‍లు డ్రా చేసుకున్నా ఆస్ట్రేలియా ఫైనల్‍కు అర్హత సాధిస్తుంది. 

(4 / 6)

ఐదో టెస్టు గెలిచినా.. శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‍పై భారత డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. భారత్ సిడ్నీ టెస్టులో విజయం సాధించి.. ఆస్ట్రేలియాపై శ్రీలంక 1-0 లేదా 2-0తో గెలువాలి. ఇలా అయితేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది. సిడ్నీ టెస్టులో ఓడినా.. లంకతో టెస్టు సిరీస్‍లో ఓ మ్యాచ్ గెలిచినా.. రెండు మ్యాచ్‍లు డ్రా చేసుకున్నా ఆస్ట్రేలియా ఫైనల్‍కు అర్హత సాధిస్తుంది. (AP)

మొత్తంగా.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. ముందుగా సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాపై గెలవాలి. అలాగే, ఆస్ట్రేలియాపై రెండు టెస్టుల సిరీస్‍లో శ్రీలంక 1-0 లేదా 2-0తో విజయం సాధించాలి. 

(5 / 6)

మొత్తంగా.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. ముందుగా సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాపై గెలవాలి. అలాగే, ఆస్ట్రేలియాపై రెండు టెస్టుల సిరీస్‍లో శ్రీలంక 1-0 లేదా 2-0తో విజయం సాధించాలి. (AP)

డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల టేబుల్‍లో దక్షిణాఫ్రికా 66.67 శాతం పాయింట్లతో టాప్‍లో ఉంది. వచ్చే ఏడాది జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‍కు ఇప్పటికే అర్హత సాధించింది. ఆస్ట్రేలియా (61.46 శాతం). ఇండియా (52.78 శాతం) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తుదిపోరుకు అర్హత సాధించేందుకు భారత్, ఆస్ట్రేలియా మధ్య పోటీ నెలకొని ఉంది. మిగిలిన ఆరు జట్లు ఇప్పటికే రేసు నుంచి తప్పుకున్నాయి. 

(6 / 6)

డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల టేబుల్‍లో దక్షిణాఫ్రికా 66.67 శాతం పాయింట్లతో టాప్‍లో ఉంది. వచ్చే ఏడాది జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‍కు ఇప్పటికే అర్హత సాధించింది. ఆస్ట్రేలియా (61.46 శాతం). ఇండియా (52.78 శాతం) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తుదిపోరుకు అర్హత సాధించేందుకు భారత్, ఆస్ట్రేలియా మధ్య పోటీ నెలకొని ఉంది. మిగిలిన ఆరు జట్లు ఇప్పటికే రేసు నుంచి తప్పుకున్నాయి. (AP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు