తెలుగు న్యూస్ / ఫోటో /
WPL 2025 Auction: డబ్ల్యూపీఎల్ వేలం తేదీ ఇదే.. ఎంత మంది ప్లేయర్లు ఉన్నారంటే?
- WPL 2025 Auction: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలం డిసెంబర్ 15వ తేదీన జరగనుంది. ఈ మినీ వేలంలో ఎంత మంది ప్లేయర్లు ఉండనున్నారో సమాచారం వెల్లడైంది.
- WPL 2025 Auction: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలం డిసెంబర్ 15వ తేదీన జరగనుంది. ఈ మినీ వేలంలో ఎంత మంది ప్లేయర్లు ఉండనున్నారో సమాచారం వెల్లడైంది.
(1 / 5)
ఐపీఎల్ మెగా వేలం గత నెలలో జరగగా.. ఇప్పుడు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలం జరగనుంది. 2025 సీజన్ కోసం డబ్ల్యూపీఎల్ వేలం ఈ నెల డిసెంబర్ 15వ తేదీన బెంగళూరులో సాగనుంది.
(2 / 5)
ఈసారి డబ్ల్యూపీఎల్ వేలంలో 120 మంది ప్లేయర్ల పేర్లు ఉన్నాయి. వీరిలో 91 మంది భారత ప్లేయర్లు, 29 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో ముగ్గురు అసోసియేట్ నేషన్స్ ప్లేయర్లు కూడా ఉన్నారు,
(3 / 5)
120 ప్లేయర్లు ఈ మినీ వేలంలో ఉండగా.. 19 మాత్రమే ఖాళీలు ఉన్నాయి. అంటే గరిష్ఠంగా ఈ మినీ వేలంలో 19 మంది ప్లేయర్లే అమ్ముడుకానున్నారు.
(4 / 5)
డబ్ల్యూపీఎల్ మినీ వేలం కోసం గుజరాత్ జెయింట్స్ పర్సులో రూ.4.4 కోట్లు ఉన్నాయి. యూపీ వారియర్స్ వద్ద రూ.3.9 కోట్లు మిగిలి ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్సులో రూ.3.25 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద రూ.2.65కోట్లు, అత్యల్పంగా ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.2.5కోట్లు ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు