హ్యాపీ కంట్రీస్ కు ఒక లిస్ట్ ఉంది; ఈ లిస్ట్ లో టాప్ లో ఫిన్లాండ్; ఇండియా స్థానం దాదాపు అట్టడుగున..
- Top 10 happiest countries: ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో భారత్ దాదాపు అట్టడుగున 126వ స్థానంలో నిలిచింది. ఈ లిస్ట్ లో ఫిన్ లాండ్ మరోసారి టాప్ పొజిషన్ లో నిలిచింది. ఈ జాబితాలో అగ్ర దేశాలేవీ స్థానం సంపాదించకపోవడం విశేషం. ఈ లిస్ట్ లోని టాప్ 10 దేశాలేంటో చూద్దాం..

(1 / 7)
ప్రపంచంలోని అత్యంత సంతోషకర దేశంగా వరుసగా ఏడో ఏడాది అగ్రస్థానాన్ని దక్కించుకుని ఫిన్లాండ్ చరిత్ర సృష్టించింది. ఈ జాబితాలో రెండో స్థానంలో డెన్మార్క్ నిలిచింది.(Unsplash)
(2 / 7)
అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న ఐస్ లాండ్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.(Unsplash)
(3 / 7)
హమాస్ తో యుద్ధంలో తలమునకలుగా ఉన్నప్పటికీ..ఇజ్రాయెల్ ఈ జాబితాలో నాలుగో స్థానం సాధించింది. అలాగే, ఈ అత్యంత సంతోషకర దేశాల లిస్ట్ లో ఐదో స్థానంలో నెదర్లాండ్స్ నిలిచింది.(Unsplash)
(4 / 7)
సమ్మిళితత్వం, సుస్థిరతతో పాటు సామాజిక సంక్షేమం పట్ల నిబద్ధత కలిగిన దేశంగా స్వీడన్ ఈ జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది.(Unsplash)
(5 / 7)
అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, బలమైన సామాజిక సంక్షేమ వ్యవస్థకు ప్రసిద్ధి చెందిన నార్వే ఈ లిస్ట్ లో ఏడవ స్థానం సాధించింది.(Unsplash)
(6 / 7)
సుందరమైన ప్రకృతి దృశ్యాలు, అధిక జీవన ప్రమాణాలతో, స్విట్జర్లాండ్ ఈ లిస్ట్ లో మొదటి 10 సంతోషకరమైన దేశాలలో 8వ స్థానంలో నిలిచింది. అలాగే, సమృద్ధికి, ఉన్నత జీవన ప్రమాణాలకు ప్రసిద్ధి చెందిన లక్సెంబర్గ్ ఈ లిస్ట్ లో 9 వ స్థానం సంపాదించింది.(Unsplash)
ఇతర గ్యాలరీలు