(1 / 5)
సౌతాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ప్యాట్ కమిన్స్ బంతితో చెలరేగాడు. ప్రొటీయాస్ బ్యాటింగ్ లైనప్ ను ఆసీస్ కెప్టెన్ ఒంటిచేత్తో పడగొట్టాడు. ఈ విధ్వంసకర బౌలింగ్ తో బుమ్రా రికార్డును ప్యాట్ కమిన్స్ బద్దలు కొట్టాడు.
(2 / 5)
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టాస్ ఓడిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టు 212 పరుగులకే ఆలౌటైంది. అయితే సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ కూడా తక్కువ పరుగులకే ఆలౌటైంది. ఆ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 138 పరుగులకు ఆలౌటైంది. అంటే ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్ లో 74 పరుగుల ఆధిక్యం లభించింది.
(3 / 5)
ప్రొటీయాస్ ఇన్నింగ్స్ పతనంలో ప్యాట్ కమిన్స్ కీలక పాత్ర పోషించాడు. అతడు 18.1 ఓవర్లు బౌలింగ్ చేసి 28 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు పడగొట్టిన కమిన్స్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఈ విషయంలో బుమ్రాను వెనక్కి నెట్టాడు.
(4 / 5)
డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో ప్యాట్ కమిన్స్ ఇప్పటివరకు 18 టెస్టుల్లో 34 ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేశాడు. 79 వికెట్లు పడగొట్టాడు. ఈ టెస్టు ఛాంపియన్షిప్ లో జస్ప్రీత్ బుమ్రా 15 మ్యాచ్ లు 28 ఇన్నింగ్స్ లో 77 వికెట్లు పడగొట్టాడు. అంటే గురువారం (జూన్ 12) బుమ్రా రికార్డును బద్దలుకొట్టి ఆసీస్ కెప్టెన్ నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు.
(5 / 5)
లార్డ్స్ లో సౌతాఫ్రికాపై ఆరు వికెట్లు పడగొట్టిన ప్యాట్ కమిన్స్ టెస్టు కెరీర్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. 68 టెస్టుల్లో 126 ఇన్నింగ్స్ లో 300 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు 14 ఇన్నింగ్స్ లో కమిన్స్ 5, అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు.
ఇతర గ్యాలరీలు