Matthew Breetzke: డెబ్యూ వన్డేలోనే 150తో వరల్డ్ రికార్డు.. సఫారీ క్రికెటర్ సెన్సేషన్.. ఎవరీ మాథ్యూ బ్రీట్జ్ కె?
Matthew Breetzke: దక్షిణాఫ్రికా క్రికెటర్ మాథ్యూ బ్రీట్జ్ కె వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అరంగేట్ర వన్డేలో 150 పరుగులతో అదరగొట్టాడు. తొలి వన్డేలోనే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు.
(1 / 5)
సౌతాఫ్రికా యువ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్ కె చరిత్ర క్రియేట్ చేశాడు. అరంగేట్ర వన్డేలో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. న్యూజిలాండ్ తో వన్డేలో ఈ సఫారీ ఓపెనర్ 148 బంతుల్లో 150 పరుగులు సాధించాడు. ఇందులో 11 ఫోర్లు, 5 సిక్సర్లున్నాయి.
(AFP)(2 / 5)
మాథ్యూ బ్రిట్జ్ కె వన్డే అరంగేట్రంలో 150 పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. ఈ దక్షిణాఫ్రికా ఓపెనర్ డెబ్యూ వన్డేలో హైయ్యస్ట్ స్కోరు రికార్డులో వెస్టిండీస్ దిగ్గజం డెస్మాండ్ హేన్స్ (1978లో 148) ను వెనక్కినెట్టాడు.
(AFP)(3 / 5)
వన్డే అరంగేట్రంలో మాథ్యూ బ్రిట్జ్ కె సంచలన 150 పరుగుల ఇన్నింగ్స్ తో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లకు 304 పరుగులు చేసింది. ముక్కోణపు సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది.
(AFP)(4 / 5)
26 ఏళ్ల మాథ్యూ బ్రీట్జ్ కె ఇప్పటికే దక్షిణాఫ్రికా తరపున టీ20, వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ 10 అంతర్జాతీయ టీ20ల్లో అతను 151 పరుగులు సాధించాడు. ఓ టెస్టు ఆడాడు.
(AFP)(5 / 5)
విరాట్ కోహ్లి లాంటి మైండ్ సెట్ ను కలిగి ఉన్న మాథ్యూ బ్రీట్జ్ కె మైదానంలో దూకుడుగా ఉంటాడు. బ్యాటింగ్ కు వచ్చే సరికి పరుగుల ఆకలితో సాగుతున్నాడు. అతను మంచి ఫీల్డర్ కూడా. చిన్నప్పటి నుంచే క్రికెట్ పై ఇష్టంతో మాథ్యూ పెరిగాడు. 25 యూత్ వన్డేల్లో వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. ఇప్పటివరకూ అన్ని టీ20ల్లో కలిపి 112 మ్యాచ్ ల్లో 2783 పరుగులు సాధించాడు. లిస్ట్- క్రికెట్లో 58 మ్యాచ్ ల్లో 1583 పరుగులు చేశాడు.
(AFP)ఇతర గ్యాలరీలు