World no Tobacco day 2024: సిగరెట్ మానేయకపోతే పదేళ్లు ముందుగానే మరణిస్తారు జాగ్రత్త
- World no Tobacco day 2024: ధూమపానం అనేక రోగాలకు కారణం అవుతోంది. దీని వల్ల కొరోనరీ గుండె జబ్బుల నుండి ఆకస్మిక మరణం వరకు అనేక చెడు ప్రభావాలు ఉన్నాయి.
- World no Tobacco day 2024: ధూమపానం అనేక రోగాలకు కారణం అవుతోంది. దీని వల్ల కొరోనరీ గుండె జబ్బుల నుండి ఆకస్మిక మరణం వరకు అనేక చెడు ప్రభావాలు ఉన్నాయి.
(1 / 5)
వరల్డ్ నో టొబాకో డే 2024: పొగాకును ఏ రూపంలో తీసుకున్నా శరీరానికి చాలా అనారోగ్యకరమే. ఇది క్యాన్సర్ఇ, తర వ్యాధులకు దారితీస్తుంది. రోజూ ధూమపానం చేసేవారిలో మరణం త్వరగా సంభవిస్తుంది. కేవలం స్మోకింగ్ చేసే వారే కాదు, వారి పక్కన నిల్చుని ఆ పొగను పీల్చేవారు కూడా ప్రమాదంలో పడతారు. ధూమపానం మాని ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలని ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. మే 31న ఈ వరల్డ్ నో టొబాకో డే నిర్వహించుకుంటారు.
(Unsplash)(2 / 5)
శరీరంపై ధూమపానం ప్రభావాలు వెంటనే పడతాయి. స్మోకింగ్ అలవాటు లేని వారు కూడా ఆ పొగను పీల్చడం కారణంగా ఎన్నో రోగాల బారిన పడతారు.
(Unsplash)(3 / 5)
కొరోనరీ హార్ట్ డిసీజెస్, ఊపిరితిత్తుల క్యాన్సర్, స్ట్రోక్ వంటివి ధూమపానం వల్ల కలుగుతాయి. ఇవి అకాల మరణానికి దారితీస్తాయి.
(Unsplash)(4 / 5)
ధూమపానం చేసే మహిళల్లో లేదా ఆ పొగను పీల్చిన మహిళల్లో పునరుత్పత్తి ఆరోగ్య ప్రభావాలు కలుగుతాయి. వారికి పుట్టే పిల్లలు కూడా తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంది.
(Unsplash)ఇతర గ్యాలరీలు