world autism awareness day 2024: పసిపిల్లల్లో ఆటిజం ప్రారంభ లక్షణాలు ఇవే
- ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్ ను ఆటిజం అని పిలుస్తారు, ఇది పసి వయసులోనే అభివృద్ధి చెందే రుగ్మత. పసిబిడ్డలలో ఆటిజం కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.
- ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్ ను ఆటిజం అని పిలుస్తారు, ఇది పసి వయసులోనే అభివృద్ధి చెందే రుగ్మత. పసిబిడ్డలలో ఆటిజం కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.
(1 / 7)
ప్రతి ఏడాది ఏప్రిల్ 2 న ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం నిర్వహించుకుంటారు, ఆటిజం, సాధారణంగా బాల్యంలోనే లక్షణాలను చూపిస్తుంది. వైద్యులు దీన్ని రెండేళ్ల వయసులోపే నిర్ధారిస్తారు. తల్లిదండ్రులు పసిబిడ్డలలో ప్రారంభ సంకేతాలను ముందే గుర్తించి వైద్యులను సంప్రదించడం అవసరం.
(Twitter/curiositygrows1)(2 / 7)
ఆటిజం ఉన్న పిల్లలు పిలిచినా స్పందించరు. నేరుగా కంటిలోకి చూసి మాట్లాడరు. ఇతరులతో దూరంగా ఉంటారు. సామాజికంగా కలవరు. ఇతర పిల్లలతో కలవకుండా దూరంగా ఉంటారు.
(Unsplash)(3 / 7)
ఆటిజం ఉన్న పిల్లలకు మాటలు రావు. రెండేళ్లకే అమ్మా, నాన్న, తాత, అత్త వంటి మాటలు పలకాలి. అవి కూడా పిల్లలు పలకడం లేదంటే వారికి ఆటిజం ఉందేమోనని అనుమానించాలి.
(Unsplash)(4 / 7)
ఆటిజం ఉన్న పిల్లవాడు చేసిన పనులనే మళ్లీ మళ్లీ చేస్తూ ఉంటారు. అందరికీ దూరంగా ఉంటారు. ఎదురుగా ఉన్న మనుషులను చూడరు.
(Unsplash)(5 / 7)
ఆటిజం ఉన్న పిల్లలు ఒకే ఒక బొమ్మతో ఆడేందుకు ఇష్టపడతారు. ఆ బొమ్మ కనిపించకపోతే వేరే బొమ్మతో ఆడేందుకు ఇష్టపడరు. పోయిన బొమ్మ కోసమే వెతుకుతూ ఉంటారు. వారికి గాయాలు తగిలినా పెద్దగా పట్టించుకోరు.
(Unsplash)(6 / 7)
ఆటిజం ఉన్న చాలా మంది పిల్లల్లో కళ్లు, చెవులు, ముక్కు వంటి ఇంద్రియాలు సున్నితంగా పనిచేస్తాయి. పెద్ద శబ్దాలు వచ్చినా పట్టించుకోరు. కొత్త వస్తువులు, రుచి, రంగులకు పెద్దగా స్పందించరు.
(Unsplash)ఇతర గ్యాలరీలు