Women’s Day Gift Ideas: ఉమెన్స్ డే కోసం గిఫ్ట్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా! కొన్ని బెస్ట్ ఆప్షన్స్ ఇవి-womens day gift ideas from iphone 13 to samsung galaxy watch 4 check full list ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Womens Day Gift Ideas From Iphone 13 To Samsung Galaxy Watch 4 Check Full List

Women’s Day Gift Ideas: ఉమెన్స్ డే కోసం గిఫ్ట్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా! కొన్ని బెస్ట్ ఆప్షన్స్ ఇవి

Feb 28, 2023, 08:13 AM IST Chatakonda Krishna Prakash
Feb 28, 2023, 08:13 AM , IST

  • Women’s Day Gift Ideas: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day) సమీపిస్తోంది. ఈ ఏడాది మహిళా దినోత్సవానికి మరో పది రోజులే (మార్చి 8) ఉంది. తమ జీవితంలో ముఖ్యమైన మహిళలకు ఈ రోజున గుర్తుండిపోయే బహుమతులు ఇచ్చేందుకు కొందరు చూస్తుంటారు. కొందరు గాడ్జెట్లను గిఫ్ట్‌గా ఇవ్వాలని ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారి కోసం కొన్ని బెస్ట్ ఆప్షన్లు ఇవి.

iPhone 13: ఐఫోన్ 14 వచ్చిన తర్వాత ఐఫోన్ 13 ధర బాగా తగ్గింది. అయినా ఇప్పటికీ ఐఫోన్ 13 ఒకానొక బెస్ట్ మొబైల్‍గా ఉంది. శక్తివంతమైన యాపిల్ ఏ15 బయోనిక్ ప్రాసెసర్, 12 మెగాపిక్సెల్ ఫ్లాగ్‍షిప్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర ప్రస్తుతం ఫ్లిప్‍కార్ట్, అమెజాన్‍లో రూ.61,999గా ఉంది. 

(1 / 6)

iPhone 13: ఐఫోన్ 14 వచ్చిన తర్వాత ఐఫోన్ 13 ధర బాగా తగ్గింది. అయినా ఇప్పటికీ ఐఫోన్ 13 ఒకానొక బెస్ట్ మొబైల్‍గా ఉంది. శక్తివంతమైన యాపిల్ ఏ15 బయోనిక్ ప్రాసెసర్, 12 మెగాపిక్సెల్ ఫ్లాగ్‍షిప్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర ప్రస్తుతం ఫ్లిప్‍కార్ట్, అమెజాన్‍లో రూ.61,999గా ఉంది. (HT Tech)

Apple AirPods Pro: మహిళా దినోత్సవం రోజున బహుమతిగా ఇచ్చేందుకు యాపిల్ ఎయిర్ పోడ్స్ ప్రో టీడబ్ల్యూఎస్ కూడా మంచి ఆప్షన్‍గా ఉంటుంది. సౌండ్, కాల్ క్వాలిటీ సహా అన్ని విభాగాల్లోనూ ఈ బడ్స్ చాలా బాగుంటాయి. వీటి ధర ప్రస్తుతం అమెజాన్‍లో రూ.26,900గా ఉంది.

(2 / 6)

Apple AirPods Pro: మహిళా దినోత్సవం రోజున బహుమతిగా ఇచ్చేందుకు యాపిల్ ఎయిర్ పోడ్స్ ప్రో టీడబ్ల్యూఎస్ కూడా మంచి ఆప్షన్‍గా ఉంటుంది. సౌండ్, కాల్ క్వాలిటీ సహా అన్ని విభాగాల్లోనూ ఈ బడ్స్ చాలా బాగుంటాయి. వీటి ధర ప్రస్తుతం అమెజాన్‍లో రూ.26,900గా ఉంది.(HT Tech)

Samsung Galaxy Watch 4: మహిళలకు స్మార్ట్ వాచ్ ఎంతో ఉపయోగపడుతుంది. సామ్‍సంగ్ గెలాక్సీ వాచ్ 4 ఇందుకు మంచి ఎంపికగా ఉంటుంది. ఎస్‍పీఓ2 ట్రాకర్, హార్ట్ రేట్ మానిటరింగ్ సహా ముఖ్యమైన హెల్త్ ఫీచర్లన్నీ ఈ వాచ్‍లో ఉంటాయి. ఫిట్‍నెస్ ట్రాకింగ్ ఆప్షన్లు ఉంటాయి. ప్రస్తుతం ఈ ప్రీమియమ్ వాచ్ ధర రూ.34,999గా ఉంది.

(3 / 6)

Samsung Galaxy Watch 4: మహిళలకు స్మార్ట్ వాచ్ ఎంతో ఉపయోగపడుతుంది. సామ్‍సంగ్ గెలాక్సీ వాచ్ 4 ఇందుకు మంచి ఎంపికగా ఉంటుంది. ఎస్‍పీఓ2 ట్రాకర్, హార్ట్ రేట్ మానిటరింగ్ సహా ముఖ్యమైన హెల్త్ ఫీచర్లన్నీ ఈ వాచ్‍లో ఉంటాయి. ఫిట్‍నెస్ ట్రాకింగ్ ఆప్షన్లు ఉంటాయి. ప్రస్తుతం ఈ ప్రీమియమ్ వాచ్ ధర రూ.34,999గా ఉంది.(Amazon)

PLAYFIT SLIM2C: తక్కువ ధరలో స్మార్ట్ వాచ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ప్లేఫిట్ స్లిమ్2సీ మోడల్‍ను పరిగణించవచ్చు. దీని ధర రూ.3,999గా ఉంది. బ్లూటూత్ కాలింగ్, 1.3 ఇంచుల సర్క్యులర్ షేప్డ్ డిస్‍ప్లే, 500 నిట్స్ బ్రైట్‍నెస్‍ను ఈ వాచ్ కలిగి ఉంది. 

(4 / 6)

PLAYFIT SLIM2C: తక్కువ ధరలో స్మార్ట్ వాచ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ప్లేఫిట్ స్లిమ్2సీ మోడల్‍ను పరిగణించవచ్చు. దీని ధర రూ.3,999గా ఉంది. బ్లూటూత్ కాలింగ్, 1.3 ఇంచుల సర్క్యులర్ షేప్డ్ డిస్‍ప్లే, 500 నిట్స్ బ్రైట్‍నెస్‍ను ఈ వాచ్ కలిగి ఉంది. (www.theworldofplay.com)

Fujifilm Instax Mini 9 Instant Camera: ఇన్‍స్టాంట్ కెమెరా కూడా మంచి గిఫ్ట్ ఐడియాగా ఉంది. ఈ ఫ్యుజిఫిల్మ్ ఇన్టాక్స్ మినీ 9 ఇన్‍స్టాంట్ కెమెరా ద్వారా.. క్యాప్చర్ చేసిన వెంటనే ఫొటోను ప్రింట్ తీసుకోవచ్చు. కెమెరాలోనే ప్రింటర్ కూడా ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఫొటో ప్రింట్‍ను పొందవచ్చు. జ్ఞాపకాలను పదిలం చేసుకునేందుకు ఈ ఇన్‍స్టంట్ కెమెరా ఉపయోగపడుతుంది. దీని ధర ప్రస్తుతం రూ.7,696గా ఉంది.

(5 / 6)

Fujifilm Instax Mini 9 Instant Camera: ఇన్‍స్టాంట్ కెమెరా కూడా మంచి గిఫ్ట్ ఐడియాగా ఉంది. ఈ ఫ్యుజిఫిల్మ్ ఇన్టాక్స్ మినీ 9 ఇన్‍స్టాంట్ కెమెరా ద్వారా.. క్యాప్చర్ చేసిన వెంటనే ఫొటోను ప్రింట్ తీసుకోవచ్చు. కెమెరాలోనే ప్రింటర్ కూడా ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఫొటో ప్రింట్‍ను పొందవచ్చు. జ్ఞాపకాలను పదిలం చేసుకునేందుకు ఈ ఇన్‍స్టంట్ కెమెరా ఉపయోగపడుతుంది. దీని ధర ప్రస్తుతం రూ.7,696గా ఉంది.(Fujifilm)

Samsung Galaxy S22 5G: స్క్రీన్ సైజ్ తక్కువగా ఉండే ఫ్లాగ్‍షిప్ ఫోన్‍ను గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటుంటే సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్22 మంచి ఆప్షన్. స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, ఫ్లాగ్‍షిప్ కెమెరాలు, అన్ని విభాగాల్లో ప్రీమియమ్ స్పెసిఫికేషన్లను ఈ మొబైల్ కలిగి ఉంది. ప్రస్తుతం డిస్కౌంట్‍తో ఫ్లిప్‍కార్ట్ లో ఈ సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్22 ప్రారంభ ధర రూ.52,149గా ఉంది.

(6 / 6)

Samsung Galaxy S22 5G: స్క్రీన్ సైజ్ తక్కువగా ఉండే ఫ్లాగ్‍షిప్ ఫోన్‍ను గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటుంటే సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్22 మంచి ఆప్షన్. స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, ఫ్లాగ్‍షిప్ కెమెరాలు, అన్ని విభాగాల్లో ప్రీమియమ్ స్పెసిఫికేషన్లను ఈ మొబైల్ కలిగి ఉంది. ప్రస్తుతం డిస్కౌంట్‍తో ఫ్లిప్‍కార్ట్ లో ఈ సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్22 ప్రారంభ ధర రూ.52,149గా ఉంది.(HT Tech)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు