Backless Blouse Designs: ట్రెండింగ్ బ్లౌజ్ డిజైన్ల కోసం వెతుకుతున్నారా? ఈ బ్యాక్ లెస్ బ్లౌజులు నచ్చుతాయేమో చూసుకొండి!
Backless Blouse Designs: మంచి రోజులు వచ్చేస్తున్నాయి. ఇక ఎక్కడ చూసినా పెళ్లిల్లు, శుభకార్యాలే. మీ ఇంట్లో కూడా శుభకార్యాలు జరగనున్నాయా.. చీరలకు ట్రెండీగా కనిపించే బ్లౌజు డిజైన్ల కోసం వెతుకుతున్నారా? అయితే ఇది మీ కోసమే. లేటెస్ట్ బ్యాక్‌లెస్ బ్లౌజ్ డిజైన్లు కొన్ని ఇక్కడ ఉన్నాయి. నచ్చితే కుట్టించుకోండి.
(1 / 8)
ఆడవాళ్లకు చీరల కోసం ఎంత ఖర్చు చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఎంత ఖరీదైన చీర కట్టుకున్నా బ్లౌజ్ డిజైన్ సరిగ్గా లేకపోతే లుక్ అంతా పాడైపోతుంది. స్టైలిష్ బ్లౌజ్ ధరించడం వల్ల సింపుల్ చీర కూడా లగ్జరీయస్‌గా కనిపిస్తుంది. అందుకే ఈ మధ్య ఆడవాళ్లు చీర కన్నా ఎక్కువ ప్రాధాన్యత జాకెట్టుకే ఇస్తున్నారు.మీరు కూడా అలాంటి వారే అయితే.. మీ చీరలకు స్టైలీష్ గా, ట్రెండీగా కనిపించే బ్లౌజు డిజైన్ల కోసం వెతుకుతున్నట్లయితే మీ కోసం ఇక్కడ కొన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ బ్యాక్ లెస్ డిజైన్స్ ఉన్నాయి. నచ్చితే సెలక్ట్ చేసుకుని మీ టైలర్ కి చెప్పి కుట్టించుకోండి.
(Instagram)(2 / 8)
డబుల్ డోరి డిజైన్: డోరి డిజైన్ బ్లౌజ్ ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది.మీరు ఈ సారి కొత్తగా ఇక్కడ కనిపిస్తున్న డబుల్ డోరీ డిజైన్ ను ట్రై చేయండి. లేటెస్ట్ అండ్ ట్రెండీ బ్యాక్ లెస్ డిజైన్స్ కోరుకునే వారు ఈ డిజైన్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది సాదా చీరలకైనా, పట్టు చీరలకైనా సెట్ అయ్యే డిజైన్.
(Instagram)(3 / 8)
ఫ్లోరల్ షేప్ బ్లౌజ్ డిజైన్: ఈ డిజైన్ అన్ని రకాల చీరలకు పర్ఫెక్ట్ గా ఉంటుంది.దీని వెనుక భాగంలో అందమైన పూల కళాఖండం ఉండటం వల్ల ఇది చాలా భిన్నంగా కనిపిస్తుంది. చూడటానికి కాస్త సింపుల్ గా అనిపిస్తున్నా ఈ డిజైన్ మీకు ట్రెండీ లుక్ ను ఇస్తుంది.
(4 / 8)
హాఫ్ బ్యాక్ లెస్ డిజైన్: మీకు ఫుల్ బ్యాక్ లెస్ డిజైన్ వద్దనుకుంటే, మీరు ఈ డిజైన్ ను ఎంచుకోవచ్చు.బ్లౌజ్ పీస్ పై కాంట్రాస్ట్ కలర్ లేదా మ్యాచింగ్ నెట్ ఫ్యాబ్రిక్ ఉపయోగించి మీరు ఈ డిజైన్ చేయవచ్చు.ఇది కాస్త స్టైలీష్ గా, హుందాగా కూడా కనిపిస్తుంది.
(Instagram)(5 / 8)
రిబ్బన్ షేప్ బ్లౌజ్ డిజైన్: బ్లౌజ్ వెనుక భాగంలో రిబ్బన్ ఆకారంలో ఉండే బ్లౌజ్ డిజైన్‌ను ఎంచుకోవచ్చు. వి ఆకారంలో ఉన్న బ్లౌజ్‌కు హుక్ పై రిబ్బన్‌ను ఉపయోగించి చాలా అందంగా డిజైన్ చేశారు. రోజువారీ దుస్తులు, కాటన్ చీరలకు ఈ డిజైన్ సరిగ్గా సరిపోతుంది. ఫ్యాన్సీ చీరకు కూడా బాగా సెట్ అవుతుంది.
(Instagram)(6 / 8)
ఈ ప్రత్యేకమైన బ్లౌజ్ బ్యాక్ డిజైన్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. దీని కింద భాగంలో యు ఆకారంలో నెక్ లైన్ డిజైన్ ఉంది. ఇది మీ లుక్ ను మరింత ట్రెండీగా, డిఫరెంట్ గా మార్చేస్తుంది. డబుల్ స్ట్రింగ్ త్రెడ్ లతో కనిపిస్తున్న ఈ డిజైన్ దాదాపు అన్ని రకాల చీరలకు సెట్ అవుతోంది. ఇది లేటెస్ట్, ట్రెండీగా కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు
(Instagram)(7 / 8)
ఓవల్ షేప్ బ్లౌజ్ డిజైన్: బ్లౌజ్ వెనుక భాగంలో ఈ ఓవల్ డిజైన్ ఈ రోజుల్లో చాలా ట్రెండీగా నడుస్తోంది. వెనుక భాగంలో రెండు నాడాలతో కనిపిస్తున్నా ఈ డిజైన్‌కు సరిపోయే పెండెంట్‌లు, పూసలను జోడించి దీన్ని మరింత స్టైలిష్ గా మార్చవచ్చు. నచ్చితే మీ టైలర్ కు చూపించి కుట్టించుకోండి.
(Instagram)ఇతర గ్యాలరీలు