Winter care: ఈ ఆయుర్వేద మూలికలతో చలికాలాన్ని సమర్ధంగా ఎదుర్కోవచ్చు-winter care these five ayurvedic herbs will keep you healthy and strong ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Winter Care These Five Ayurvedic Herbs Will Keep You Healthy And Strong

Winter care: ఈ ఆయుర్వేద మూలికలతో చలికాలాన్ని సమర్ధంగా ఎదుర్కోవచ్చు

Dec 08, 2023, 09:17 AM IST Haritha Chappa
Dec 08, 2023, 09:17 AM , IST

  • Ayurvedic care in Winter: చలికాలం వచ్చిందంటే రకరకాల వ్యాధులు దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. గుండె జబ్బులు, మధుమేహం వంటివి పెరుగుతాయి.

చలికాలంలో తరచూ వచ్చేది ఫ్లూ. అలాగే జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్, జ్వరం వంటివి కూడా దాడి చేస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల ఆయుర్వేద మూలికలు వాడడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. 

(1 / 6)

తులసి ఆకులను ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు. తులసి ఆకుల రసాన్ని ఒక స్పూను ప్రతి రోజూ తాగితే మంచిది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో యాంటీ బాక్టిరియల్ లక్షణాలు అధికం. 

(2 / 6)

అల్లంలో జింజెరాల్ అని పిలిచే పదార్థం ఉంటుంది. ఇది వికారం, వాంతులు వంటి సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. కాబట్టి ప్రతిరోజూ అల్లం టీ తాగేందుకు ప్రయత్నించండి. 

(3 / 6)

వేపఆకులలో ఎన్నో సమ్మేళనాలు ఉంటాయి. వేప ఆకులను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. వేప కషాయాన్ని తాగితే ఆర్ధరైటిస్ వంటి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. 

(4 / 6)

ఆయుర్వేదంలో అశ్వగంధానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పొడిని నీళ్లలో కలుపుకుని తాగితే ఒత్తిడి హార్మోన్లు ఉత్పత్తి కాకుండా ఉంటాయి. నిద్రలేమిని కూడా దూరం చేస్తుంది. 

(5 / 6)

త్రిఫల చూర్ణాన్ని ఉసిరి, కరక్కాయ, తానికాయలతో తయారుచేస్తారు. ఇది అనేక రోగాల నివారణకు ఉపయోగిస్తారు. జీర్ణశక్తికి మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్య రాకుండా అడ్డుకుంటుంది. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు