(1 / 6)
తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్…! లోక్ సభ ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ నెలలోని పలు తేదీల్లో మద్యం దుకాణాలు మూతపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జూలై నెలలో ఏకంగా రెండు రోజులు షాపులు క్లోజ్ కానున్నాయి.
(2 / 6)
జూలై 17వ తేదీన మొహరం పండగ ఉంది, ఈ తేదీన మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
(image source from unsplash.com)(3 / 6)
జులై 21న బోనాల పండుగ ఉంది. ఈ తేదీన కూడా హైదరాబాద్ నగరంలోని పలు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో షాపులు క్లోజ్ కానున్నాయి.
(image source from unsplash.com)
(4 / 6)
ఈ లెక్కన చూస్తే జులై మూసంలో రెండు రోజుల డ్రై డేగా ఉండనుంది. అయితే బోనాల పండగ నేపథ్యంలో ఏఏ ప్రాంతంలో దుకాణాలు బంద్ అవుతాయనే దానిపై ఎక్సైజ్ శాఖ నుంచి ఆదేశాలు వెలువడనున్నాయి.
(image source Twitter)(5 / 6)
డ్రై డేలో లిక్కర్ కోనుగోలు చేస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ రెండు రోజులు కూడా ఇదే తరహా నిబంధనలను అమలు చేయనున్నారు.
(image source from unsplash.com)(6 / 6)
గత నెల 4వ తేదీన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో తెలంగాణలోని అన్ని మద్యం దుకాణాలు బంద్ అయిన సంగతి తెలిసిందే.
(image source Twitter)ఇతర గ్యాలరీలు