(1 / 6)
హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. రేపు శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన నగరంలోని వైన్స్ షాపులు బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు.
(istock,com)(2 / 6)
వాడవాడలా రామనామ స్మరణతో శ్రీరామనవమి వేడుకలు జరగనున్న నేపథ్యంలో.. రేపు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మూతపడనున్నాయి.
(ఫైల్ ఫొటో)
(3 / 6)
మద్యం దుకాణాలతో పాటు కల్లు దుకాణాలు, బార్లు బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
(4 / 6)
ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. దీంతో.. ఆదివారం (ఏప్రిల్ 06) మద్యం దుకాణాలు మూసివేయనున్నారు.
(5 / 6)
అయితే స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మాత్రం ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఉంటుందని పోలీసులు తెలిపారు.
(6 / 6)
ఇతర గ్యాలరీలు