Janmashtami: జన్మాష్టమి నాడు జన్మించిన ఈ లోకనాథ్ బాబాను శ్రీకృష్ణుడు లేదా శివుని అవతారంగా ఎందుకు భావిస్తారు?
Janmashtami: జన్మాష్టమి నాడు లోకనాథ్ బాబా జన్మించారని, అతనే పరమ శివుడు, శ్రీకృష్ణుడు అవతారమని చెప్పుకుంటారు. అసలు లోకనాథ్ బాబా ఎవరు? అతని జీవితకథేంటో తెలుసుకోండి.
(1 / 6)
భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో లోకనాథ్ బాబాను శ్రీకృష్ణుడు, మహా శివుడితో సమానం భావిస్తారు. ఆయనను 'శివ లోక్ నాథ్' అని కూడా పిలుస్తారు.
(2 / 6)
లోకనాథ్ బాబా తన గురువు భగవాన్ గంగోపాధ్యాయతో కలిసి కఠినమైన తపస్సు కోసం హిమాలయాలకు వెళతారు. ఈ భారీ మంచు గుహలో గురు భగవాన్ గంగోపాధ్యాయ సాధనలో కూర్చుంటే, బాబా లోక్‌నాథ్ గుహను వదిలి బయటికి వచ్చి మంచులో కూర్చుని ధ్యానం చేశారు.
(3 / 6)
రోజులు, వారాలు, నెలలు ఎలా గడిచాయో ఎవరికీ తెలియదు. లోకనాథ్ శరీరం మంచుతో కప్పడిపోయింది. దీన్ని గురుదేవ్ మంచు గుహ నుండి చూసేవాడు.
(4 / 6)
అలా ధ్యానంలోనే గురుదేవ్ కు తొంభై ఏళ్ళు నిండాయి. ఆయన ఒకరోజు బయటికి తొంగి చూడగా లోక్‌నాథ్ బాబా కనిపించలేదు. అతని స్థానంలో ఆ మహా శివుడు కనిపించారు.
(5 / 6)
గురుదేవ్ మంచు గుహలోంచి బయటకు వచ్చి సిద్ధాసనంలో కూర్చున్న బాబా లోకనాథుడిని చూశాడు. మరుక్షణం లోకనాథ్ బాబాకు బదులు మహాదేవుడు కూర్చుని ఉన్నట్టు కనిపించాడు.
ఇతర గ్యాలరీలు